అంత్యక్రియలకు హాజరైన చంద్రబాబు..
మాజీమంత్రి, రైతు నాయకుడు యడ్లపాటి వెంకట్రావు అంత్యక్రియలకు చంద్రబాబు హాజరయ్యారు. గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన అంత్యక్రియల్లో టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆయన భౌతికకాయాన్ని సందర్శించి, నివాళులర్పించారు. టీడీపీ జెండాను యడ్లపాటి పార్థివ దేహంపై ఉంచి, చంద్రబాబు అంజలి ఘటించారు. తెనాలి బుర్రిపాలెం రోడ్డులోని శ్మశాస వాటికలో ప్రభుత్వ లాంఛనాలతో యడ్లపాటి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. యడ్లపాటి పాడెను చంద్రబాబు పట్టారు. తెనాలిలోని యడ్లపాటి ఇంటి నుంచి శ్మశన వాటిక వరకు చంద్రబాబు కాలినడకన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. యడ్లపాటి జీవితం ఆదర్శవంతమైందన్నారు. మంచి విద్యావంతుడుగా .. అహర్నిశలు ప్రజకోసం తన జీవితాన్ని అంకితం చేశారని చెప్పుకొచ్చారు. ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో వెంకట్రావుని చూసి నేర్చుకోవాలన్నారు. తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన సేవలు ఎనలేనివని చంద్రబాబు కొనియాడారు.
Must Read:-సొంత బాబాయి హత్య కేసు ఒక మిస్టరీ అయితే.. ఇక పౌరుల ప్రాణాలకు రక్షణ ఏదీ? – చంద్రబాబు











