సినిమాల కోసం ఎదురుచూసేవారికి ఇది చల్లని కబురే. సాయిధరమ్ తేజ్, నభా నటేష్ హీరోహీరోయిన్లుగా రూపొందిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ డిసెంబరు 25న థియేటర్లలో విడుదలకాబోతోంది. సుబ్బు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించారు. ఇందులో జీ స్టూడియోస్ భాగస్వామ్యం కుదిరింది. ఈ మేరకు ఆ రెండు సంస్థలు గతంలో ఓ ప్రకటన కూడా చేశాయి. ఈ సినిమా డిసెంబరులో విడుదల కాబోతున్నట్లు లియో న్యూస్ ముందే వార్తను ఇచ్చింది. క్రిస్మన్ కానుకగా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.
ఈ రోజు అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది. సాయిధరమ్ తేజ్, నభా నటేష్ కెమిస్ట్రీ ఆకట్టుకుంటుందని అంటున్నారు. రొమాన్సు, ఫన్, కామెడీ ఈ సినిమా రూపొందింది. ప్రతి సన్నివేశాన్ని నూతన దర్శకుడు సుబ్బు ఎంతో బాగా మలిచారని అంటున్నారు. ఈ సినిమాని థియేటర్లోనే విడుదల చేయాలని పట్టుదలతో ఉన్నారు. ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వడంతో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఇప్పటికే తమన్ పాటలు ఆకట్టుకుంటున్నాయి. డిసెంబర్లో థియేటర్లలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని గతంలోనే ఆ సంస్థలు వెల్లడించాయి.
హీరో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ, జీ గ్రూప్ ఈ చిత్రంలో భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉందని కూడా అన్నారు. ఈ సినిమాకి వెంకట్ సి. దిలీప్ ఛాయాగ్రహణాన్ని, తమన్ సంగీతాన్ని సమకూర్చారు. ఇంతకాలం గ్యాప్ తర్వాత ఈ సినిమా విడుదలవుతుండటంతో దీనికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుందోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. దీనికి లభించే స్పందనను బట్టి ఇతరులు కూడా తమ సినిమాల విడుదలను ప్లాన్ చేసుకునే పనిలో పడ్డారు.
Can't wait to listen to your cheers and whistles. Feel privileged to be part of a film which is releasing first in the new normal. Let's restart and go back to our beloved theaters. #SoloBrathukeSoBetter – Coming to theaters near you this Christmas.#SBSBOnDec25th pic.twitter.com/Vy9V8eITNw
— Sai Dharam Tej (@IamSaiDharamTej) November 28, 2020
Must Read ;- వరుస ప్లాపులేనా! ఈ సారైనా హిట్టొచ్చేనా?











