లాస్టియర్ చిత్ర లహరి, ప్రతి రోజూ పండగే చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలు ఖాతాలో వేసుకున్నాడు మెగా హీరో సాయి ధరమ్ తేజ. ఈ ఏడాది కూడా కొన్ని మంచి ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టుకున్నాడు. అందులో మొదటగా విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’. కొత్త కుర్రోడు సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా లాక్ డౌన్ కు ముందే ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది సినిమా. నిజానికి ఈ ఏడాది మేలో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ అనుకున్నారు. అయితే కరోనా ఔట్ బ్రేక్ కారణంగా సినిమా ఇప్పటి వరకూ విడుదలకు నోచుకోలేకపోయింది.
ఇప్పట్లో థియేటర్స్ తెరుచుకొనే పరిస్థితులు లేకపోవడంతో.. అన్ని సినిమాల్లాగానే ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీని కూడా జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల చేయబోతున్నారనే వార్తలొచ్చాయి. అయితే థియేటర్స్ త్వరలో రీ ఓపెన్ అయ్యే సూచనలు కనిపించడంతో.. ఓటీటీల్లో తమ సినిమాలు విడుదల చేయాలనుకున్న వారంతా.. ఇప్పుడు థియేట్రికల్ రిలీజెస్ వైపే మొగ్గు చూపిస్తున్నారు. అందులో భాగంగానే ఈ సినిమాను డిసెంబర్ లో థియేటర్స్ లో విడుదల చేయబోతున్నామని నిర్మాతలు ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం ‘సోలో బ్రతుకే సో బెటర్’ మూవీని క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతున్నారనే వార్తలొస్తున్నాయి. డిసెంబర్ మూడో వారంలో సోలో బ్రతుకే సో బెటర్ సినిమా థియేటర్స్ లో విడుదల కానుందని తెలుస్తోంది. ‘ప్రతిరోజూ పండగే’ సూపర్ హిట్ తర్వాత ఈ సినిమా రాబోతున్న నేపథ్యంలో మంచి అంచనాలున్నాయి. మరి సాయితేజ ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ఇస్తుందో చూడాలి.
Must Read ;- మెగా మేనల్లుడికి ఏమైంది?











