సాయిధరమ్ హీరోగా రూపొందిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాపై ఎట్టకేలకు ఓ స్పష్టత వచ్చేసింది. ఈ సినిమాని థియేటర్లలోనే విడుదల చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్.ఎల్.పి. బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమా ద్వారా సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నభా నటేశ్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా విడుదల విషయంలో ఇప్పటిదాకా అనేక వార్తలు వచ్చాయి. ఇది ఓటీలో విడుదల కాబోతోందంటూ కూడా వార్తలు వచ్చాయి.
దీన్ని ఓటీటీలో విడుదల చేయటానికి హీరో, నిర్మాతలు సుముఖంగా లేరు. లేకుంటే ఈపాటికే ఈ సినిమా ఓటీటీలో విడుదలై ఉండేది. అయితే థియేటర్ల ప్రారంభం మీద ఇంకా స్పష్టత లేకపోయినా దీన్ని ఎప్పుడు విడుదల చేయాలనే విషయంలో మాత్రం స్పష్టత వచ్చినట్టే ఉంది. ఈ సినమా విడుదల థియేటర్లలోనే అని హీరో క్లారిటీ కూడా ఇచ్చేశాడు. డిసెంబరులో ఈ సినిమా విడుదలవుతుందని తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు.
అంటే దాదాపు థియేటర్లు డిసెంబరులోనే ప్రారంభం కావచ్చన్న సమాచారం సాయితేజ్ వద్ద ఉన్నట్లుంది. లేకుంటే అంత ధైర్యం ప్రకటన చేసి ఉండేవాడు కాదు. ‘సంక్రాంతి కంటే ముందే అంటే డిసెంబర్‌లోనే.. మీకూ నాకూ ఇష్టమైన థియేటర్లలో కలుద్దాం. దీపావళి శుభాకాంక్షలు’ అంటూ ఓ పోస్టర్‌ని తేజు తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. మొత్తానికి సంక్రాంతి బరిలో కాకుండా సోలోగానే రావడానికి సాయి తేజ్ సిద్దమైనట్లు కూడా కనిపిస్తోంది.