అపర దాన కర్ణుడు, జనం దృష్టిలో హీరో జనానికి తన ప్రత్యర్థి ఎవరో ప్రకటించేశారు. అలా అనడం కంటే తన వారసుడిని పరిచయం చేశారంటేనే బాగుందేమో. నాకు పోటీ ఇచ్చేది ఇతనేనంటూ ఓ కుర్రాడిని తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు. ఇప్పటిదాకా సోనూ సూద్ అది చేశాడు… ఇది చేశాడూ లాంటి వార్తలు ఎవరికైనా బోర్ కొడితే మాత్రం ఈ వార్త అందరికీ నచ్చుతుంది. సోనూకు అంత గట్టి పోటీ ఇచ్చే వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా? అతని కుమారుడే… అతని పేరు ఇషాన్ సూద్. ఈరోజు అతని పుట్టన రోజట. ఆ ఆనందాన్ని సోనూ ఇలా నెటిజన్లతో పంచుకున్నారు.
ఇద్దరూ ఒకరకమైన డ్రెస్ వేసుకున్నారు. ఫిట్ నెస్ లో తనకు తన కుమారుడు పోటీపడుతున్నాడంటూ సోనూ పేర్కొన్నారు. ”నా హీరో ఇషాన్ సూద్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఫైనల్‌గా నాకు ఫిట్నెస్ విషయంలో పోటీ ఇచ్చే వ్యక్తి ఉన్నాడు.” అంటూ బాడీని ఎక్స్పోజ్ చేసే పిక్‌ను సోనూ పోస్ట్ చేశారు. అయితే ఇది ఇషాన్ చిన్నప్పటి ఫొటో . ఇప్పుడెలా ఉన్నాడో మనకు తెలియదు. ఈ పిక్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే నెటిజన్లు అంతా ఇషాన్ సూద్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
https://www.instagram.com/p/CFUAS32Az-X/?utm_source=ig_web_copy_link











