కొత్త పీఆర్సీ వేతన బిల్లులను ప్రాసెస్ చెయ్యం!
చీకటి జీవోలు ప్రకారం కొత్త పీఆర్సీని అనుసరిస్తూ.. జీతాలు ప్రాసెస్ చేయమంటే తాము చెయ్యమని ట్రెజరీ ఉద్యోగులు సంఘ నాయకులు గతంలో జగన్ రెడ్డి ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు లేఖ రాశారు. తాము ఉద్యోగుల సంఘాల జేఏసీలో భాగమేనేనని, కొత్త పీఆర్సీని అనుసరించి జీతాలు ప్రాసెస్ చేస్తే నష్టపోతామని తేల్చి చెప్పారు. కానీ ప్రభుత్వం వేతన బిల్లులను ప్రాసెస్ చేయాలని ఆదేశిస్తూ.. వరుస సర్క్యూల్స్ ను విడుదల చేసి ఒత్తిడిని పెంచింది. నిన్న ఆదివారం కూడా జీతాలను ప్రాసెస్ చేయాలని ఆదేశించింది. ఉద్యోగులు ఆందోళనలో మాత్రమే ఉన్నారు.. ఇంకా సమ్మెకు వెళ్లలేదు కదా.. విధుల్లోనే ఉన్నారు కాబట్టి ప్రభుత్వం చెప్పినట్లు పాటించాలని ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ ఉద్యోగులను ఆదేశించింది. అయితే ప్రభుత్వాదేశాలను, తీసుకొస్తున్న ఒత్తిడికి తలొగ్గేదేలే అని తేల్చి చెప్పారు ట్రెజరీ ఉద్యోగులు. ఈ క్రమంలో బిల్లులు ప్రాసెస్ చేయని ట్రెజరీ ఉద్యోగులకు ప్రభుత్వం చార్జీ మెమోలను జారీ చేసింది. ఎన్నిసార్లు సర్క్యూలర్లు జారీ చేసిన జీతాల బిల్లులను ప్రాసెస్ చేయకపోవడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
27 మందికి చార్జీ మెమోలు జారీ..
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకు చెందిన మొత్తం 27 మంది డిడి, ఎన్టీఓ, ఏటిఓ లకు మెమోలు జారీ చేశారు. 2022 జనవరి 29వ తేదీ సాయంత్రం 6 గంటలకు వరకూ విధుల్లో విఫలమైన వారిపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శ్రీకాకుళం, అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన ముగ్గురు డిడివోలతోపాటు, వివిధ జిల్లాకు చెందిన 21 మంది ట్రెజరీ అధికారులు, ఇద్దరు ఏటీఓ లకు చార్జీ మెమోలు జారీ అయ్యాయి. నూతన పీఆర్సీ ప్రకారం జీతాల బిల్లులు సిద్ధం చేయడంలో అలక్ష్యంగా వ్యవహరించినందుకు వీరికి మోమోలు జారీ చేసినట్లు ఉన్నతాధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరోవైపు ఇప్పటి వరకు కేవలం 25శాత బిల్లులు మాత్రమే ట్రెజరీకి వచ్చాయని ఉద్యోగులు చెబుతున్నారు. ట్రెజరీల నుంచి ప్రతి రెండు గంటల ఒకసారి నివేదిక పంపాలని మెడపై కత్తిపెట్టి మరి ఆర్థిక శాఖ అదేశాలు జారీ చేసింది. అయినా ఇప్పటికీ 75 శాతం వరకూ ఇంకా బిల్లులు ప్రాసెస్ కాలేదు. దీంతో ఫిబ్రవరి 1, మంగళవారం నాడు ఉద్యోగుల అకౌంట్లలో జీతాలు పడటం అనుమానంగానే మారింది.
Must Read:-‘జగన్’ సన్నిహితుల ఆర్థిక వ్యవహారాలపై కేంద్రం నిఘా..?