ఉద్యమం చేస్తున్న సమయంలో వివాదాలకు దారితీసే నిర్ణయాలు!
ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలు, ఉద్యోగులు వ్యతిరేకిస్తున్న జగన్ రెడ్డి మాత్రం తాననుకున్నదే జరగాలి అన్నట్లు వివాదస్పద నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తుంటారు. ఈ తరుణంలో ప్రభుత్వం తీసుకున్న అనేక ప్రజా వ్యతిరేఖ నిర్ణయాలపై ఇప్పటికే 190 సార్లు న్యాయస్థానంలో ప్రభుత్వ వ్యతిరేక తీర్పులు వెలువడిన బుద్ధి రాలేదని విపక్షలు మండిపడుతున్నాయి. తమ సమస్యల డిమాండ్లను నెరవేర్చాలని గత మూడు నెలలుగా ఉద్యోగులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్న జేఏసీ నేతలను బుజ్జగిస్తూ.. కాలయాపన చేస్తూ గడిపింది జగన్ రెడ్డి ప్రభుత్వం! తీరా ఉద్యోగుల నుంచి ఒత్తిడి మొదలవ్వడంతో చర్చలు పేరుతో మరో నెల రోజులు అదిగో.. ఇదిగో అంటూ నెట్టకొచ్చారు. ఇక జాప్యం తగదని ఆందోళన బాటపట్టిన ఉద్యోగులను పిల్చి.. పచ్చి మోసపూరిత పీఆర్సీ ని ప్రకటించి దగా చేశారు. దీంతో సోయి తెచ్చుకుని ఉద్యమ బాటపడితే.. కొంచెం కూడా జాలి లేకుండా కోతలతో కూడిన కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించడం ఎలా చూడాలని జేఏసీ నేతలు మండిపడుతున్నారు.
కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలకు ట్రెజరీ కార్యాలయాలకు ఆదేశాలు!
రాష్ట్రంలో ప్రజా సేవలకు వివిధ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న 13 లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలకు జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిబంధకంగా మారింది. ఉద్యోగులు హక్కుల ప్రకారం వారికి రావాల్సిన బెనిఫిట్స్ ను వారికి అందించకుండా మీనమేషాలు లెక్కించింది. తీరా డిమాండ్ చేస్తుంటే, వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా, ప్రభుత్వ అనుకున్నదే చేసుకుంటూ పోతూ.. నింబంధనలకు పాతరేస్తోంది. గురువారం కొత్త పీఆర్సీ, తగ్గించిన హెచ్ఆర్ఏ ప్రకారమే వేతన బిల్లులు తయారు చేయాలని అధికారులకు జగన్ ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. కొత్త సాఫ్ట్ వేర్ తయారు చేసి, ఇప్పటికే జిల్లాలకు పంపారు. ఈ నెల 25వ తేదీ లోపు బిల్లులు పంపాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. 23 శాతం ఫిట్మెంట్ కోత పెట్టిన హెచ్ఆర్ఏ, కొత్త డీఏలను కలుపుకుని బిల్లుల తయారీకి ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ట్రెజరీ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. సవరించిన పే స్కేల్స్ ఆధారంగా జీతాల్లో మార్పులు చేయాలని స్పష్టం చేసింది. ఒకపక్క ఉద్యోగులు ఉద్యమం బాట పట్టిన వేళ కనీసం డిమాండ్స్ ను పరిగణలోకి తీసుకోకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఏమిటని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.