హత్యకు గురైన డిగ్రీ విద్యార్థిని అనూష కుటుంబానికి న్యాయం చేయాలంటూ మృతురాలి కుటుంబసభ్యులు, విద్యార్థులు , వివిధ పార్టీల ఆందోళన నేపధ్యంలో నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ ఆందోళనకు టీడీపీ, కమ్యూనిస్టు పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని, నిందితుడిని తమకు అప్పగించాలన్న డిమాండ్‌తో ఆందోళన చేస్తున్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
‘గన్ కంటే ముందు జగన్ వస్తానన్నాడుగా…‘
అనూష హత్యను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఖండిస్తూ జగన్ సర్కారు తీరుపై మండిపడ్డారు.‘ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరిగితే గన్ కంటే ముందు జగన్ వస్తాడని కబుర్లు చెప్పారన్నారు. జగన్ పాలనలో మహిళలకు న్యాయం జరగడం లేదన్నారు. అనూషను హత్య చేసిన విష్ణువర్దన్‌రెడ్డిని కఠినంగా శిక్షించి బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Must Read ;- బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యకు పోలీసులే కారణం..
ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడితే గన్ కంటే ముందు @ysjagan వస్తాడని సొల్లు కబుర్లు చెప్పారు.దిశ చట్టం అంటూ మాయ చేసారు.ఇప్పుడు గన్ను రావడం లేదు జగన్ కనపడటం లేదు.ఒక్క మహిళకు న్యాయం జరిగింది లేదు. కళ్ళ ముందే ఆడపిల్లలను మృగాళ్లు బలి తీసుకుంటున్నా జగన్ రెడ్డి లో చలనం రావడం లేదు.(1/3) pic.twitter.com/nskKMD0pZP
— Lokesh Nara (@naralokesh) February 24, 2021