హైదరాబాద్ ఘట్ కేసర్ ప్రాంతానికి చెందిన బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దీనికి కారణం పోలీసుల అత్యుత్సాహమే అంటూ న్యాయవాది అరుణ్‌కుమార్ హెచ్ ఆర్ సీలో పిటీషన్ వేశారు. కిడ్నాప్ ఘటనలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి.. ప్రెస్‌మీట్‌లు పెట్టడం వల్ల విద్యార్థిని మానసికంగా కుంగిపోయిందని తెలిపారు. విద్యార్థిని విషయంలో కోర్టులు చెప్పాల్సిన స్టేట్ మెంట్లు పోలీసులు చెప్పడం ఆమె బలవన్మరణానికి పాల్పడిందని అరుణ్ కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి మరణానికి వారి కుటుంబానికి నష్ట పరిహారం అందేలా పోలీసులకు ఆదేశించాలని కోరారు. పోలీసుల వ్యవహరించిన తీరుపై చర్యలు చేపట్టాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు.
కిడ్నాప్ కేసుతో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన యువతి కేసు చివరకు ఆత్మహత్యగా ముగిసిన సంగతి తెలిసిందే. తన ఆడిన కిడ్నాప్ డ్రామా కేసు రాష్ట్రమంతా తెలిసి తన పరువు పోవడంతో యువతి మానసికంగా కుంగుబాటుకు గురయింది. దాని వల్లే షుగర్ ట్యాబెట్లు మింగి ఆత్మహత్యకు పాల్పడిందని సమాచారం.
Must Read ;- కిడ్నాప్ డ్రామా ఖరీదు.. ఆ యువతి ప్రాణం..!