పంచాయతీ ఎన్నికల్లో తమకు ఓటు వేయలేదని గుంటూరు జిల్లా ఇసప్పాలెంలో ఇళ్ల ముందున్న మెట్లు, అరుగులు, డ్రైనేజీని పొక్రెయినర్లతో ధ్వంసం చేయడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో జగ్గూ గ్యాంగ్ అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. ఈ సంఘటన ద్వారా జగ్గూ గ్యాంగ్ ఛీప్ మెంటాలిటీ బయపడిందని ఆయన ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. నరసరావుపేట ఎమ్మెల్యే ఆదేశాల మేరకు స్థానిక వైసీపీ నేతలు కూల్చివేతలకు పాల్పడ్డారని లోకేష్ ధ్వజమెత్తారు.
తగిన శిక్ష విధించే రోజు దగ్గరలోనే ఉంది
అరాచక వైసీపీ పాలనకు చరమగీతం పాడి, వారికి తగిన శిక్ష విధించే రోజు దగ్గరలోనే ఉందని నారా లోకేష్ దుయ్యబట్టారు. నరసరావుపేట సమీపంలోని గోగులపాడు పంచాయతీలో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు అత్యధిక వార్డులు గెలవడం జీర్ణించుకోలేని నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే పోలీసులతో దౌర్జన్యాలు చేయిస్తున్నాడని లోకేష్ మండిపడ్డారు. ఈ ఘటనలను తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంపై గౌరవం లేని వైసీపీ నాయకులకు ప్రజలు త్వరలోనే తగిన బుద్ది చెబుతారని లోకేష్ హెచ్చరించారు.
Must Read ;- కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా: లోకేశ్
.@ysjagan విధ్వంస పాలనకు ఇది పరాకాష్ట. పంచాయతీ ఎన్నికల్లో వైకాపాకి ఓటు వెయ్యలేదనే కారణంతో నరసరావుపేట నియోజకవర్గం, ఇస్సాపాలెం పరిధిలోని శిశుమందిర్ వద్ద ఇళ్ల ముందు డ్రైనేజ్, మెట్లు కొట్టేసిన చీప్ మెంటాలిటీ జగ్గూ గ్యాంగ్ ది.(1/3) pic.twitter.com/r8b1SXbiuK
— Lokesh Nara (@naralokesh) February 15, 2021