నరసరావుపేట శివారులో దారుణం చోటు చేసుకుంది. డిగ్రీ విద్యార్థిని కోట అనూషను ఓ దుండగుడు గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని కాలువలో పడేశాడు. పాలపాడు రోడ్డులోని గోవిందపురం మేజర్ కాలువ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలు ముప్పాళ్ల మండలం గోళ్లపాడు వాసిగా పోలీసులు గుర్తించారు. విద్యార్థిని మృతదేహంతో బంధువులు ధర్నా నిర్వహిస్తున్నారు. విద్యార్ధులు, అనూష చదువుతున్న కాలేజీపై రాళ్లు రువ్వారు.
ఈ హత్యకు పాల్పడిన విష్ణువర్ధన్ రెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తనను కాదని వేరొక యువకుడితో చనువుగా ఉంటుందనే అనుమానంతో యువతిని చంపినట్లు నిందితుడు పేర్కోన్నాడు. హత్యకు పాల్పడిన నిందితుడిని తమకు అప్పగించాలంటూ బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. దీంతో పరిస్ధితి ఉద్రిక్తంగా మారడంతో.. పోలీసులు అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
Must Read ;- ఘట్ కేసర్ కిడ్నాప్ డ్రామా యువతి ఆత్మహత్య..











