మా టీకా సామర్థ్యం రేంజ్ ఇంతుంది.. మా టీకా వల్ల ఎటువంటి సమస్యలు తలెత్తవు.. ఇలా టీకా ఉత్పత్తిదారులు కొన్ని రోజులుగా తమ టీకాల గురించి ఊదరగొడుతున్నాయి. ఇవన్నీ సరే.. అసలు టీకా వేసుకునేదే.. కరోనా బారిన పడకుండా ఉండడానికి.. మరి ఏ టీకా ఎంత కాలం రక్షిస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం చాలా మంది వెతుకుతున్నారు. మరి ప్రస్తుతం పలు దేశాల్లో అందిస్తున్న టీకాల పవరెంతో తెలుసుకుందాం రండి..
ముందుగా ఫైజర్..
ఫైజర్.. బ్రిటన్-అమెరికా కంపెనీలు సంయుక్తంగా తయారుచేసిన ఈ టీకా బ్రిటన్ దేశం అనుమతించిన మొదటి టీకా. ఈ తర్వాత పలు దేశాల్లో అనుమతులు లభించాయి. అంతేకాదు.. డబ్యుహెచ్‌ఓ అనుమతించిన మొదటి వ్యాక్సిన్‌గా పేరు గాంచింది ఫైజర్. ఈ వ్యాక్సిన్ కారణంగా చిన్నపాటి సమస్యలు తలెత్తుతున్నా.. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక దేశాల్లో అత్యయిక అనుమతిపొందిన వ్యాక్సిన్ ఫైజర్ అనే చెప్పాలి. ఫైజర్ ప్రయోగ ఫలితాల ప్రకారం ఈ టీకా తీసుకున్న 85-95 రోజుల తర్వాత కూడా శరీరం కరోనా ఎదుర్కొనే యాండీబాడీలను ఉత్పత్తి చేయడంలో సమర్థంగా పనిచేస్తుందని సంస్థ తెలుపింది. అంతేకాదు.. కరోనాతోపాటు సార్స్ వ్యాధిని కూడా నిరోధించడంలో సమర్థంగా పనిచేస్తుందని సంస్థ వెల్లడించింది.
మోడెర్నా పవర్ ఫుల్..
ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలలో తుదిదశకు చేరుకున్న మొదటి వ్యాక్సిన్ మోడెర్నా. ఈ టీకా తీసుకున్న వారిలో యాంటీ బాడీలు అత్యంత వేగంగా ఉత్పత్తి అవుతున్నాయి. వాటి నిర్వీర్యం అత్యంత స్వల్పంగా, నిదానంగా ఉన్నాయని సంస్థ ఎగ్జిక్యూటివ్ చీఫ్ ప్రకటించారు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలను కరోనాను రెండేళ్లపాటు నివారించే శక్తి ఉంటుందని సంస్థ వెల్లడించింది.
కొవిషీల్డ్ పరిస్థితేంటి?
ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెన్‌కా ప్రతిష్టాత్మకంగా రూపొందించిన కొవిషీల్డ్ వ్యాక్సిన్.. భారతదేశంలో ప్రధాన వ్యాక్సిన్‌గా ప్రజలకు అందించడానికి ప్రభుత్వం సమాయత్తమవుతుంది. ఈ నేపథ్యంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ మాటేమిటి? దాని పవరెంత? ఎంత కాలం రక్షిస్తుంది? ఇలా ఎన్నో ప్రశ్నలు.. వ్యాక్సిన్ రూపొందిస్తున్న ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటి చీఫ్ సైంటిస్ట్ చెప్తున్న ప్రకారం.. కొవిషీల్డ్ రక్షణ దాదాపు కొన్నేళ్లపాటు ఉంటుందని.. సహజంగా ఉత్పత్తి అయ్యే రోగనిరోధక శక్తితో పోలిస్తే.. కొవిషీల్డ్ 10 రెట్లు సమర్ధవంతంగా యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుందని చెప్తున్నారు. వారి ఇస్తున్న సమాచారం ప్రకారం 2 ఏళ్లపైన కొవిషీల్డ్ రక్షణ అందిస్తుందని చెప్తున్నారు.
మన దేశీయ వ్యాక్సిన్ పవరెంత?
మన దేశ ప్రజలంతా ఎంతో గర్వంచదగ్గ వ్యాక్సిన్ భారత్ బయోటెక్ రూపొందించిన కొవ్యాక్సిన్. ప్రపంచంలో పలు దేశాల శాస్త్రవేత్తల ప్రశంసలందుకుంది. మూడో దశలో ప్రయోగాల్లో ఉండగానే.. ప్రయోగ డేటా ఆధారంగా భారత్ అత్యయిక అనుమతులు అందించింది. సంస్థ అందించిన ప్రయోగ పత్రాలలో తెలియజేసిన సమాచారం ప్రకారం.. ఈ వ్యాక్సిన్ వేసిన అనంతరం వైరస్‌ను ఎదుర్కోగలిగే యాంటీబాడీలు సంవత్సర కాలం పాటు ఉంటాయని చెప్పింది.
సుత్నిక్‌తో రెండేళ్లు నిశ్చింత
ప్రపంచంలోనే మొదటి కరోనా వ్యాక్సిన్‌గా నమోదు చేసుకున్న టీకా ‘సుత్నిక్’. గమాలియా ఇన్‌స్టిట్యూట్ తయారుచేసిన ఈ వ్యాక్సిన్.. రష్యాలో మిలియన్లమంది తీసుకున్నారు. సంస్థ తమ ప్రతాలలో పొందుపరిచిన సమాచారం ప్రకారం.. సుత్నిక్ తీసుకున్న వారు రెండేళ్ల పాటు కరోనా భయం లేకుండా ఉండచ్చని చెప్తుంది. దీని ప్రకారం సుత్నిక్ యాంటీబాడీలు రెండేళ్ల పాటు రక్షణ అందిస్తాయని తెలుస్తుంది.