సరుగుడులో యథేచ్ఛగా బాక్సైట్ తవ్వకాలు..
విశాఖ జిల్లాలో సరుగుడులో ‘‘లేటరైట్ పేరుతో బాక్సైట్ ను తవ్వేస్తున్నారు’’ అని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన సంచలన ఆరోపణలు ప్రస్తుతం మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. జగన్ రెడ్డి స్వయాన బాబాయి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి నేతృత్వంలో నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా బాక్సైట్ తవ్వకాలు జరుగపుతున్నారని అయ్యన్న పాత్రుడు విమర్శలు గుప్పించారు. విచ్చలవిడిగా తవ్వేస్తున్నా.. అధికారులేవ్వరూ పట్టించుకోవడం లేదన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అండతో రోజూ వందలాది లారీల్లో బాక్సైట్ ను రైల్వే వ్యాగన్స్ ద్వారా వేల టన్నులను భారతి సిమెంట్ ఫ్యాక్టరీకి తరలిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
అక్రమ రవాణకు ఎన్ఆర్జీఎస్ నిధులతో రిజర్వ్ ఫారెస్ట్ లో రోడ్డా.. హవ్వా!?
అధికారం చేతులో ఉంది కదా.. ఏం చేసినా సరిపోద్ది అనుకుంటున్న జగన్ రెడ్డి .. ఏకంగా రిజర్వ్ ఫారెస్ట్ లో 10 కిలోమీటర్ల మేరకు రోడ్డును వేశారు. ఈ రోడ్డుకు అటవీశాఖ అధికారుల అనుమతుల ఇచ్చారా? ఇస్తే ఎలా ఇస్తారు? ఇచ్చినా.. బాక్సైట్ అక్రమ రవాణకు ఎన్ఆర్ జీఎస్ నిధులతో ఇలా ఎలా రోడ్డు నిర్మాణం చేపడుతారని జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని అయ్యన్నపాత్రుడు సూటిగా ప్రశ్నించారు. వన్యప్రాణులకు అవాసలుగా మారిన అటవీ ప్రాంతంలో దొపిడి దొంగలు పడ్డట్లు యథేచ్ఛగా లేటరైట్ తవ్వకాల అనుమతులతో బాక్సైట్ తవ్వకాలు జరుపుతున్నారని ఆయన ఆగ్రహించారు. ఎటువంటి అనుమతుల లేకుండా అక్రమంగా మైనింగ్ కు పాల్పడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రజావసరాల నిమిత్తం రోడ్డు వేశామని అటవీ శాఖాధికారులు చెబుతున్నా.. వాటిపై ఎటువంటి రుసుం చెల్లించకుండా భారీ వాహనాలను ఎలా అనుమతి ఇస్తున్నారని ఆయన నిలదీశారు. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల సరిహద్దులో ఇంత దోపిడీ జరుగుతుంటే నర్సీపట్నం, ప్రత్తిపాడు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎందుకు ఖండించ లేకపోతున్నారని ప్రశ్నించారు. దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలని అయ్యన్న డిమాండ్ చేశారు.