అధికార మత్తు తలకెక్కిందంటే… ఎవరేమీ చెప్పినా వినిపించదు. ఒకవేళ వినిపించినా… ఆ మాటలు కఠినంగా అనిపిస్తాయి. అదే అధికార మత్తు దిగిపోయిన తర్వాత అధికారంలో ఉండగా తాను చేసిన తప్పడుగులన్నీ పదే పదే గుర్తుకు వస్తూ ఉంటాయి. తిరిగి అధికారం చేజిక్కాలంటే ఏం చేయాలన్న దిశగా ఆలోచన మొదలవుతుంది. అప్పుడే…మనకంటే ముందు ప్రజల మధ్యలో తిరిగి, జనం మధ్యనే ఉంటూ… వారి వాణినే తమ బాణీలుగా చేసుకున్న నేతల ప్రస్థానాలు గుర్తుకు వస్తాయి. అప్పుడు సదరు నేతలు ప్రత్యర్థి వర్గానికి చెందిన వారని తెలిసినా కూడా వారి బాటలోనే నడిచేందుకు మొగ్గు చూపుతారు. ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారు? మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైనాట్ 175 అంటూ బీరాలు పలికి…11 సీట్లకు పరిమితమైపోయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అునసరిస్తున్న వ్యూహాలు చూస్తుంటే…ఈ ప్రస్తావన గుర్తుకు వస్తోంది. 2019 ఎన్నికల్లో అటు పార్టీతో పాటు ఇటు తను కూడా ఓటమిపాలు కాగా… ఏమాత్రం అధైర్యపడక… ఐదేళ్ల పాటు జనంలోనే ఉంటూ… జనంతోనే మమైకమవుతూ, తనను ఓడించిన ప్రజలతో మరింతగా మమేకమై తిరిగి తనతో పాటు పార్టీకి కూడా రికార్డు విక్టరీని అందించిన టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ బాట ఇప్పుడు జగన్ కు ఆదర్శంగా నిలుస్తోంది.

జనవరి నుంచి జగన్ నిజంగానే లోకేశ్ నడిచిన దారిలోనే నడిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు జగన్ ఆదేశాలతో ఆ పార్టీ శ్రేణులు ఏర్పాట్లను ప్రారంభించేశాయి. జనవరి రెండోవారం నుంచి నిత్యం జనంలోనే ఉుండాలని జగన్ తీర్మానించుకున్నారట. అందులో భాగంగా రాష్ట్రంలోని 26 జిల్లాలను చుడుతూ ఓ భారీ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని టచ్ చేయడంతో పాటుగా ప్రతి నియోజకవర్గంలో రెండు రోజుల పాటు తన పర్యటన ఉండేలా జగన్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అంతేకాకండా తాడేపల్లిలో ఉంటే సమయంలో తన కోసం వచ్చే పార్టీ కార్యకర్తలను అందరినీ కలిసేలా కూడా జగన్ ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం. ఇలా తనను కలిసేందుకు వచ్చే పార్టీ కార్యకర్తలు తన నుంచి ఎలాంటి అపాయింట్ మెంట్ లేకుండానే తనను కలవొచ్చు అనే సందేశాన్ని జనంలోకి పంపాలని కూడా జగన్ నిర్ణయించుకున్నారట. ఈ విషయంలో తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో పాటుగా… మంగళగిరిలో నారా లోకేశ్ అనుసరించిన వ్యూహాన్నే తాను అమలు చేయాలనుకుంటున్నట్లు జగన్ భావిస్తున్నారట. ఈ రెండు కార్యక్రాలతో తిరిగి ప్రజలకు చేరువ కావడం ద్వారా… 2029 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముుందుకు సాగాలని జగన్ భావిస్తున్నారట.
వాస్తవానికి 2019 ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాజయమే ఎదురైంది. అంతేకాకుండా అప్పటికే మంత్రిగా కొనసాగతున్న నారా లోకేశ్ కూడా మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఓ సీఎం కుమారుడిగానే కాకుండా… సిట్టింగ్ మంత్రిగా ఉంటూ లోకేశ్ ఓడిపోయిన తీరుపై పెద్ద చర్చే నడిచింది. ఇలాంటి పరిస్థితుల్లో లోకేశ్ కాకుండా ఇంకెవరైనా ఉండి ఉంటే… జనానికి ముఖం చాలేసేవారేనేమో. అయితే లోకేశ్ ను ఈ ఓటములు కుంగదీయలేకపోయాయి. పార్టీ ఓటమితో పాటు తన ఓటమి కూడా లోకేశ్ ను అధర్యపడేలా చేయలేకపోయాయి. ఈ ఓటములు లోకేశ్ ను మరింత కార్యోన్ముఖుడిగా మార్చాయని కూడా చెప్పక తప్పదు. ఓడ కోల్పోయిన చోటే వెదుక్కోవాలన్న చందంగా… ఓడిన చోటే గెలిచి చూపించాలన్న కసి లోకేశ్ లో అంతకంతకూ పెరిగింది. అంతేకాకుండా కష్టాల్లో ఉన్న పార్టీని గట్టెక్కించాలన్న కసి కూడా ఆయనలో మరింతగా పెరిగిపోయింది. అంతే…ముందూ వెనుకా చూసుకోకుండా…మంగళగిరి ప్రజలతో మరింతగా మమేకమయ్యే రీతిలో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. తనను ఓడించినా ఫరవా లేదు ంమగళగిరి అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానన్న రీతిలో ఓ స్పష్టమైన సందేశం అక్కడి ప్రజలకు చేరవేయడంలో లోకేశ్ కృతకృత్యులయ్యారనే చెప్పాలి. ఇక పార్టీ కోసం యవగళం పేరిట లోకేశ్ చేసిన యాత్ర టీడీపీని తిరిగి అధికారంలో రూర్చోబెట్టింది.
ఇలా ఓటమి నుంచి తనతో పాటు పార్టీకి పునరుజ్జీవం అందించిన లోకేశ్ ప్రస్థానంపై పదే పదే సమీక్షలు చేసిన మీదటే జగన్… లోకేశ్ బాటలోనే సాగాలని నిర్ణయించకున్నట్లుగా సమాచారం. 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత పాదయాత్ర చేపట్టిన జగన్.. 2019 లో అధికారం చేతికి అందగానే… జనానికి దూరమైపోయారు. కనీసం పార్టీ కార్యకర్తలను కలిసేందుకు వారి వాణిని వినేందుకుకు కూడా జగన్ సిద్ధ పడలేదు. అటు కార్యకర్తలతో పాటు ఇటు జనానికి కూడా జగన్ దూరమైపోయారు. ఫలితంగా వైనాట్ 175 అంటూ జగన్ బరిలోకి దిగితే… 11 సీట్లే మీకు ఎక్కువంటూ జనం గట్టి తీర్పునే ఇచ్చారు. ఫలితంగా కనీసం అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత ోదా కూడా దక్కించకోలేని స్థితిలోకి జగన్ దిగజారారు. అంతేకాకంుడా ఎక్కడ అసెంబ్లీకి వెళితే… తనను అధికార పక్షం తనను అవమానిస్తుందోనన్న భయంతో జగన్ ఆ ఛాయలకే వెళ్లలేకపోతున్నారు. తాను అధికారంలో ఉండగా.. తాను విపక్షాలను వేధించిన మాదిరిగానే తననూ ఇప్పుడు అధికార పార్టీ వేధిస్తుందన్న భయమే జగన్ ను అసెంబ్లీకి దూరం చేసిందని చెప్పాలి. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే… లోకేశ్ అనుసరించిన మార్గమే శరణ్యమన్న అంచనాకు జగన్ వచ్చారు.