ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైైైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలి కాలంలో వైరి వర్గాల నుంచి మాస్ ర్యాగింగ్ ను ఎదుర్కొంటున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైై నాట్ 175 అంటూ బరిలోకి దిగిన జగన్ పార్టీకి జంన 11 సీట్లు మాత్రమే ఇచ్చిన వైైనం ఈ ర్యాగింగ్ కు బీజం వేస్తే… ఆ తర్వాత జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ఆయన వైరి వర్గాలకు వరుసగా అస్త్రాలను అందిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే టీడీపీతో పాటు జనసేన, బీజేపీలు జగన్ కు ఎంతమాత్రం గ్యాప్ ఇవ్వకుండానే విరుచుకుపడుతున్నాయి.ఇప్పుడు ఈ జాబితాలోకి జగన్ సోదరి వైఎస్ షర్మిల కూడా చేరిపోయారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ గా కొనసాగుతున్న షర్మిల… ఎన్నికల ముందు నుంచీ జగన్ పైైైై విమర్శలు గుప్పిస్తున్నా… గురువారం నాడు మాత్రం ఆమె ఏకంగా జగన్ పై మాస్ ర్యాగింగ్ కు పాల్పడ్డారు. అదానీ సంస్థల నుంచి లంచాలు తీసుకున్నట్లుగా తనపై వచ్చిన ఆరోపణలప స్పందించేందుకు బుధవారం మీడియా ముందుకు వచ్చిన జగ్ దాదాపుగా 2 గంటల పాటు తనదైైనన శైైలి వాదనలు వినిపించారు. తాజాగా జగన్ చెప్పి అంశాలను గుర్తు చేస్తూ షర్మిల… జగన్ తీరును ఎండగట్టారు.
అదానీతో జగన్ సర్కారు చేసుకున్ ఒప్పందం రాష్ట్రంలో ఓ చరిత్రగానే కాకుండా అంతర్జాతీయంగానూ చరిత్రగా నిలిచిపోతుందని షర్మిల ధ్వజమెత్తారు. ఓ ముఖ్యమంత్రి హోదాలో ఓ వ్యాపారవేత్త నుంచి రూ.1,750 కోట్ల ముడుపులు తీసుకోవడం అంతర్జాతీయంగా చరిత్ర కాక మరేమిటని కూడా ఆమె ప్రశ్నించారు. ఈ వ్యవహారాన్ని అమెరికా కోర్టులే బయటపెట్టాయన్న షర్మిల… అమెరికా కోర్టులు బయటపెట్టిన అంశంపైనా జగన్ అబద్ధాలు చెబుతున్నారని ఆమె విమర్శించారు. అబద్దాలను అతికినట్టుగా చెబుతున్న జగన్ కు ఆస్కార్ అవార్డు ఇవ్వవచ్చని కూడా ఆమె సెటైర్లు సంధించారు. వ్యాపారవేత్తల నుంచి లంచాలు తీసుకున్నదే కాకుండా… తాను చేసిన ఘన కార్యానికి తనకు సన్మాానాలు చేయాలని జగన్ కోరుకోవడం నిజంగానే విడ్డూరంగా ఉందన్నారు. మర్యాదలను కూడా అడిగి మరీ కోరుకుంటున్న సీఎంగా జగన్ కు… వ్యాపారవేత్తలతో చీకటిలో కలవరాదన్న సంగతి తెలియదా? అని ప్రశ్నించారు. వ్యాపారవేత్తలతో చీకటి ఒప్పందాలు చేసుకున్నందుకు జగన్ కు మర్యాద ఇవ్వాలా? అని ఆమె నిలదీశారు.
అదానీ సంస్థలతో ఒప్పందాల ద్వారా తాను రాష్ట్రానికి లక్షన్నర కోట్ల మేర సంపదను సృష్టించానని చెప్పిన జగన్ వ్యాఖ్యలను షర్మిల కొట్టిపారేశారు. అంతేకాకుండా ఈ ఒప్పందాల్లో జగన్ సర్కారు చేసిన మాయాజాలాన్ని కూడా షర్మిల బయటపెట్టారు. అదానీ సంస్థలు ఉత్పత్తి చేస్తున్న సోలార్ విద్యుత్ ను గుజరాత్ సర్కారు యూనిట్ ఒక్కింటికి రూ.1.99 లకే కొంటున్దని ఆమె తెలిపారు. అంతేకాకుండా అదానీ సంస్థల నుంచి విద్యుత్ ను కొనేందుకు ఇతర రాష్ట్రాలేవీ ముందుకు రాకున్నా… ఒక్క జగన్ సర్కారు మాత్రమే అత్యుత్సాహం ప్రదర్శించిందని కూడా ఆమె ఆరోపించారు. అందులో భాగంగానే రూ.1.99కే లభిస్తున్న అదానీ పవర్ ను రూ.2జ49కి కొనుగోలు చేశారన్నారు. అంతేకాకుండా ఈ ఒప్పందాలను ఏకంగా 25 ఏళ్ల పాటు కొనసాగేలా అంగీకరించారని మండిపడ్డారు. ఫలితంగా ఏపీ ప్రజలపై రూ.1.67 లక్షల కోట్ల భారాన్ని మోపారన్నారు. రాష్ట్ర ప్రజలప ఇంతమేర భారాన్ని మోపిన జగన్… లక్ష కోట్ల రూపాయల మేర సంపదను సృష్టించానని గొప్పలు చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు.
ఇక అమెరికా కోర్టులు నమోదు చేసిన కేసుల్లో తన పేరే లేదన్న జగన్ వ్యాఖ్యలపైనా షర్మిల సెటైర్ల వర్షం కురిపించారు. అమెరికా కోర్టులు నమోదు చేసిన కేసుల్లో ఏపీ సీఎం అని చాలా స్పష్టంగా ఉందన్న షర్మిల…నాడు ఏపీ సీఎంగా ఉన్నది తానేనన్న విషయాన్ని జగన్ మరిచిపోయారా? అని ఆమె నిలదీశారు. అదానీలతో ఒప్పందాలు జరిగిన నాడు సీఎం సీట్లో జగన్ కాకుండా…ఆయనను వెనకుండి నడిపించిన వారు కూర్చున్నారా? అని షర్మిల వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అదానీల నుంచి ఏపీ సీఎంకు ముడుపులు ముట్టాయని అమెరికా కోర్టులే చెబుతున్నా… జగన్ ఇంకా బుకాయించాలని చూస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఒక్క సోలార్ విద్యుత్ లోనే కాకుండా చాలా అంశాల్లో అదానీలకు జగన్ లబ్ధి చేకూర్చారన్నారు. పోర్టులను కూడా జగన్ సర్కారు అదానీలకు కారు చౌకగా అమ్మేసిందన్నారు. ఇలా జగన్ ఏకంగా రాష్ట్రాన్నే ఓ బ్లాంక్ చెక్ మాదిరిగా అదానీలకు రాసిచ్చేశారని ఆమె ఆరోపించారు.