డైనమిక్ యాక్టర్ జగపతి బాబు ప్రధాన పాత్రలో నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఎఫ్.సి.యు.కే (ఫాదర్ చిట్టీ ఉమా కార్తిక్ ). దీనికి విద్యా సాగర్ రాజు దర్శకుడు. కార్తిక్, అమ్ము అభిరామి ఈ సినిమాలో జంటగా నటించారు. ఈ సినిమాతో నటుడు బాలాదిత్య రైటర్ గా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీ ఈ నెల 12న విడుదల కాబోతున్న సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైద్రాబాద్ లో గ్రాండ్ గా జరిపారు.

అయితే ఈ ఈవెంట్ ప్రత్యేకత ఏంటంటే.. సోషల్ మీడియా స్టార్స్ , అలాగే.. 9 నెలల కోవిడ్ మహమ్మారి తర్వాత ఫ్రంట్ లైన్ వారియర్స్ ను గౌరవించాలని, వారిని ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించి. ఈ సినిమాలోని సాంగ్స్ ను వారితో విడుదల చేయించారు హీరో జగపతి బాబు. ముఖ్యంగా ఈ ఈవెంట్ కు టిక్ టాక్ స్టార్ దుర్గారావు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
ఇందులోని ‘అనుకున్నది అవ్వదిరా.. కానీ అయ్యేది తెలవదు రా’ అనే పాటను అతని చేత లాంచ్ చేయించారు. ఈ క్రమంలో దుర్గారావు మాట్లాడుతూ.. ఏదో టిక్ టాక్ వీడియో లు చేసుకుంటూ బతికే తనను.. ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన జగపతి బాబుకి తన కృతజ్ఞతలు తెలియచేసి.. తాను చిన్నప్పటి నుంచి జగపతి బాబు ఫ్యాన్ నని , నాకు ఆయనతో రెండు స్టెప్స్ వేయాలని తన కోరికను తెలియచేయగా.. వెంటనే జగపతి బాబు… దుర్గారావు తో ‘అనుకున్నది అవ్వదిరా.. కానీ అయ్యేది తెలవదు రా’ అనే పాటకు హుషారు గా చిందులేశారు.
Also Read: విలన్ గా జగపతిబాబు విశ్వరూపం











