సింహస్వప్నం సినిమాతో హీరోగా పరిచయమైన జగపతిబాబు.. తొలిప్రయత్నంలో మెప్పించలేకపోయినా.. ఆతర్వాత వాయిస్ సరిగా లేదని విమర్శలు ఎదుర్కున్నా.. పట్టుదలతో కష్టపడ్డాడు. ఆతర్వాత పెద్దరికం, గాయం, శుభలగ్నం తదితర చిత్రాలతో సక్సస్ సాధించి కుటుంబ కథా చిత్రాల హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నారు. @అంతఃపురం, సముద్రం, మనోహరం* తదితర యాక్షన్ మూవీస్ లోను నటించి మెప్పించారు.
అయితే.. హీరోగా వెనకబడిన టైమ్ లో లెజెండ్ సినిమాలో ప్రతి నాయకుడుగా ఎంట్రీ ఇచ్చి విలన్ గా సైతం మెప్పించారు. ఇప్పుడు ప్రతి నాయకుడుగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీగా ఉన్నారు. తెలుగులోనే కాకుండా.. తమిళ్, కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. జగపతిబాబు ట్విట్టర్ లో ఏసుక్రీస్తు గెటప్ లో ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. అయితే.. ఈ ఫోటో పోస్ట్ చేశారు కానీ.. ఏ సినిమాలో ఈ గెటప్ లో కనిపించనున్నారు అనేది మాత్రం చెప్పలేదు.
దీంతో ఏసుక్రీస్తు గెటప్ లో ఉన్న జగ్గుభాయ్ ని చూసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తలకు ముళ్ల కిరీటం, మేకులతో సిలువకు కొట్టిన చేతులు, రక్తం కారుతోన్న ముఖంతో జగపతి బాబు ఇందులో కనపడుతున్నాడు. ఈ స్టిల్ చూసిన నెటిజన్లు ఏసుక్రీస్తుగా కరెక్ట్ గా సెట్ అయ్యారంటూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి.. జగపతిబాబు ఈ ఫోటో గురించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
Must Read ;- ‘కరుణామయుడు’ వెనక ఎంతపెద్ద ‘షో’ నడిచిందో?