ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాకి రంగం సిద్ధమవుతోంది. ఇది యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు 30వ సినిమా. దీనికి ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే పేరు పరిశీలనలో ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘రౌద్రం రణం రుధిరం’ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా ముగింపు దశలో ఉంది. ఇందులో నటిస్తున్న రామ్ చరణ్ కూడా వేరే చిత్రాలకు కమిట్ అయ్యారు. ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల సినిమా త్వరలోనే ప్రారంభోత్సవం జరుపుకునే అవకాశం ఉంది. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే అంటున్నారు.
ఈ సినిమాకి సంబంధించిన తాజా అప్ డేట్ ఏమిటంటే ఇందులో విలన్ గా తమిళ హీరో శింబు నటిస్తున్నాడట. మరో విలన్ గా సునీల్ పేరు కూడా వినిపిస్తోంది. అంతే కాదు ఇద్దరు హీరోయిన్లు ఉంటారట. వారిలో బాలీవుడ్ తార జాన్వీ కపూర్ ఉంటుందని సమాచారం. అలాగే మరో బాలీవుడ్ నటి వరీనా హుస్సేన్ కూడా ఖరారైనట్టు సమాచారం. త్రివిక్రమ్ ఈ సినిమాకి సంబంధించి పూర్తి స్క్రిప్టు సిద్ధంచేసి రెడీగా ఉన్నట్టు తెలిసింది. ఎన్టీఆర్ ఎప్పుడు వచ్చినా సెట్స్ కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంతకుముందు వీరిద్దరి కలయికలో అరవింద సమేత వీరరాఘవ వచ్చిన సంగతి తెలిసిందే.
అసలు విషయం ఏమిటంటే ఈ సినిమాకి పాన్ ఇండియా లుక్ రావాలంటే ఓ బాలీవుడ్ దిగ్గజం కావాలి. అందుకు సంజయ్ దత్ అయితేనే న్యాయం జరుగుతుందన్న ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నారు. పైగా సంజయ్ దత్ కేజీఎఫ్ 2లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆ సినిమాకి హైప్ రావటానికి సంజూ కూడా ఓ కారణం. త్రివిక్రమ్, ఎన్టీఆర్ ల సినిమాలో సంజయ్ దత్ ఓ కీలక రాజకీయ నాయకుడి పాత్రను పోషించనున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ పాత్రకు ధీటుగా ఇందులో సంజయ్ దత్ పాత్ర ఉంటుందట. మొత్తానికి ఇదేదో రాజకీయ నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కేలా ఉంది. భవిష్యత్తులో ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చస్తే పనికొచ్చేలా ఈ పాత్రను మలచనున్నట్లు సమాచారం.











