November 8, 2026 1:29 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Cinema

రాజమౌళికి జక్కన్న అనే పేరు అందుకే పెట్టా: ఎన్టీఆర్

ట్రిపుల్ ఆర్ సినిమా విశేషాలను ఎన్టీఆర్ నోట వింటే ఎలా ఉంటుంది. ఆ ప్రయత్నాన్ని ఇంటర్నేషనల్ ఫిలిం ట్రేడ్ ప్రచురణ సంస్థ డెడ్ లైన్ చేసింది. ఆ ఇంటర్వ్యూ విశేషాలు తెలుగులో మీకోసం

May 12, 2021 at 5:59 PM
in Cinema, Tollywood
Share on FacebookShare on TwitterShare on WhatsApp

జూనియర్ ఎన్టీఆర్ మొట్టమొదటిసారిగా ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. పైగా ఇది మల్టీస్టారర్ సినిమా. నందమూరి ఫ్యామిలీ హీరో, మెగా ఫ్యామిలీ హీరో కలిసి రాజమౌళి లాంటి దిగ్గజం దర్శకత్వంలో ట్రిపుల్ ఆర్ చేయడం పెద్ద విశేషం. ప్రస్తుతం కోవిడ్ పాజిటివ్ తో ఎన్టీఆర్ చికిత్స తీసుకుంటున్నారు. మరి ఈ సినిమా విశేషాలను ఎన్టీఆర్ నోట వింటే ఎలా ఉంటుంది. ఆప్రయత్నాన్ని ఇంటర్నేషనల్ ఫిలిం ట్రేడ్ ప్రచురణ సంస్థ డెడ్ లైన్ చేసింది. ఫోన్ ద్వరానే ఎన్టీఆర్ ను ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఏం చెప్పారో చూద్దాం.

కరోనా ప్రభావం గురించి మీరేమనుకుంటున్నారు?

నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. నేను మొదటి సినిమాలో నటించినప్పుడు నాకు 17 ఏళ్లు. అప్పట్నుంచి నేను ఏడాది 365 రోజులూ కష్టపడటానికి ఇష్టపడతాను. అలా పనిచేయగలిగే శక్తి నాకు ఉంది. ఇలా ఇంట్లో బందీగా ఉండటం ఇదే ఆఖరిసారి కావాలనుకుంటున్నాను. మరో కోణంలో ఆలోచిస్తే నాకు ఇద్దరు చిన్నపిల్లలు. వారితో గడపడానికి మంచి సమయం దొరికింది. అమ్మ, నా భార్య, బంధువులతో కూడా గడపగలిగాను. షూటింగ్ కు వెళ్లాల్సి వచ్చినా అంతే ఉత్సాహంతో వెళతాను. మరో వైపు ఓటీటీ పుణ్యమా అని సినిమాల పరిధి బాగా పెరిగింది. ప్రజల అభిరుచులు కూడా మారుతున్నాయి. వారికేం కావాలో, నేనేం చేయాలో తెలుసుకోడానికి కూడా ఈ పరిస్థితులు తోడ్పడ్డాయి.

ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడదాం. దీన్ని ఆర్ఆర్ఆర్ అనాలా? ట్రిపుల్ ఆర్ అనాలా?

 ప్రాథమికంగా ఆర్ఆర్ఆర్. ట్రిపుల్ ఆర్ అని పలుకుతున్నారంతే.

రాజమౌళి, రామారావు, రామ్ చరణ్ కలిపి ట్రిపుల్ ఆర్ అన్నారు కదా. రౌద్రం, రణం, రుధిరం అని కూడా అంటున్నారు?

మొదట ఈ సినిమా మా పేర్లతోనే ప్రారంభమైంది. అరుదైన కలయిక ఇది. ఇండియాలో ఇప్పటిదాకా చూడని అతి పెద్ద మల్టీస్టారర్ ప్రయత్నం. అందుకే వర్కింగ్ టైటిల్ గా ట్రిపుల్ ఆర్ వచ్చింది. అలా ఇది చాలా పాపులర్ అయ్యింది. ఓ దశలో రాజమౌళి దీనికి ట్రిపుల్ ఆర్ అని ఎందుకు పెట్టకూడదు అనకున్నారు. అప్పుడు రౌద్రం, రణం, రుధిరం అనే పేరును నిర్ణయించారు.

ఈ ట్రిపుల్ ఆర్ ప్రయాణం ఎప్పుడు ప్రారంభమైంది?

2018 నవంబరులో ప్రారంభమైంది. రాజమౌళి ఈ ప్రాజెక్టు గురించి చెప్పినప్పుడే ఇది సుదీర్ఘమైన ప్రయాణం అని అర్థమైంది. ఆయన బాహుబలిని ఐదేళ్లపాటు రెండు భాగాలుగా తీశారు. ట్రిపుల్ ఆర్ విషయానికి వచ్చేసరికి మేము దాదాపు 8 నెలలు కరోనా మహమ్మారి బారిన పడ్డాం. సాంకేతికంగా ఈ సినిమాని 19 నెలల్లోనే పూర్తిచేశాం. సాంకేతికంగా చూస్తే ఈ సినిమాకు అంత సమయం అవసరం. ఇందులోని ఫైట్స్ అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. రాజమౌళి ఏ విషయంలోనూ రాజీపడరు. అక్టోబరు 13న విడుదల చేయాలనుకుంటున్నాం. ఇప్పటికే ఆ తేదీకే విడుదల చేయడానికి అవకాశం ఉంది.

కరోనా కారణంగా ఈ సినిమాలో మార్పులేమైనా జరిగాయా?

కథ పరంగా, బడ్జెట్ పరంగా ఎలాంటి మార్పూ జరగలేదు. మేము పనిచేస్తున్న వేగం మాత్రం మారిపోయింది. రేయింబవళ్లు పనిచేసి సినిమాని పూర్తిచేయగలిగాం. ఇలా చేయాల్సి రావడానికి కరోనానే కారణం. ఈ మహమ్మారి వల్ల చిత్ర పరిశ్రమ బాగా దెబ్బతింది. ఎవరి బాగోగులు వారే చూసుకోవాలి. ప్రభుత్వ పరంగా పెద్దగా సహకారం ఏమీ లేదు. సినిమా షూటింగ్ మొదలుకుని థియేటర్లో విడుదలయ్యేదాకా ఒక మహా యజ్ఞమే. థియేటర్లు ప్రారంభం కాగానే ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఇది మాకు ఆశాకిరణం లాంటిది.

ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారా?

ఓటీటీలో విడుల చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. ఇది పెద్ద తెరపైనే చూసి ఆనందించాల్సిన సినిమా. బాహుబలి, జురాసిక్ పార్క్, ఎవెంజర్స్ లాంటి సినిమాలను మీరు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయగలరా? అందుకే ఓటీటీ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. సినిమా హాళ్ల కోసం ఎంతకాలమైనా ఎదురుచూస్తాం. ఇలాంటి సినిమాలను చూడటానికి జనం థియేటర్లకు వస్తారన్న నమ్మకం మాకుంది. మనదేశం సినిమాల మీదే ఆధారపడి ఉంది. ప్రేక్షకులు ఇలాంటి సినిమాలను థియేటర్లలోనే చూస్తారు. ఇది కూడా అలా చూడాల్సిన సినిమానే.

ఈ సినిమా మీద మీకున్న నమ్మకం ఏమిటి?

మన దేశంలో అత్యంత సక్సెస్ ఫుల్ దర్శకుడు రాజమౌళి చేసిన సినిమా ఇది. ‘బాహుబలి’ అతను ఎలాంటి మార్కెట్ ను సృష్టించగలిగాడో మీకు తెలుసు. అతని ఖ్యాతి దిగంతాలకు వ్యాపించింది. పాన్ ఇండియా సినిమాకి తెరతీశాడు. ఒక తెలుగు చిత్రం మన దేశంలోనే కాకుండా చైనా, అమెరికా, ఇంగ్లండు లాంటి దేశాల్లో సైతం విజయఢంకా మోగిస్తుందని మాకు తెలియదు. దాన్ని రాజమౌళి నిరూపించారు. ఆర్ఆర్ఆర్ కూడా ఆ స్థాయి సినిమా అనే నమ్మకం మాకుంది. రామ్ చరణ్, నేను కలిసి నటించడం వల్ల కూడా ఇది క్రేజీ ప్రాజెక్టు అయ్యింది.

రాజమౌళితో మీ అనుభవం గురించి చెప్పండి?

ఇది ఆయనతో నేను చేస్తున్న నాలుగో సినిమా. 2001లో మేము మొదటిసారి కలిసి ప్రయాణించాం. భారతీయ సినిమాల పరంగా ఏదో సాధించాలన్న తపన ఉన్న దర్శకుడు. అప్పటికీ ఇప్పటికీ ఆయన ఆలోచనలు ఏమీ మారలేదు. ఆయన ఓ టాస్క్ మాస్టర్. నటుల నుంచి నటనను ఎలా రాబట్టుకోవాలో బాగా తెలుసు. ఆ విషయంలో రాజీ పడడు. ఆయనలోని ఆ గుణాన్ని గమనించే జక్కన్న అనే ముద్దు పేరు పెట్టాను.

ఇది ఒక శిల్పి పేరు. ఆయన నుంచి ఎన్నో అద్భుతమైన శిల్పాలు రూపొందాయి. సినిమాని అలాంటి కళాఖండంగా మలిచే శిల్పి మా జక్కన్న. నిజానికి ఇది ఎంతో కఠినమైన పని, అయినా ఆయన రాజీపడరు సినిమాని అందంగా చెక్కుతూనే ఉంటారు. ఆయనతో పనిచేయడం నాకెంతో ఆనందం కలిగిస్తుంది. నా అప్తుడు ఇంతలా ఎదిగినందుకు నాకెంతో ఆనందంగానూ, గర్వంగానూ ఉంది.

మీరు పోషించింది వాస్తవ పాత్ర. ఈ విప్లవకారుడి పాత్ర పోషణ కోసం మీరు ఎలాంటి పరిశోధన చేశారు? ఏమైనా ఒత్తిడి ఫీలయ్యారా?

కచ్చితంగా. ఈ విప్లవ హీరోలకు దేశవ్యాప్తంగా పరిచయం చేయబోతున్నాం. వీరు స్థానికి పోరాట యోధులు. వారు సాధించినదాన్ని ప్రపంచానికి చూపించటమే మా పని. వారి గురించి మాకు కొంత తెలుసు. చాలా పరిశోధన కూడా జరిగింది. ఆ పాత్రలను తెరపై చూపించాల్సి వచ్చినపుడు మేం వారి జీవితాల్లోకి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ పాత్రల కథలను నా పిల్లలకు చెబుతున్నా.

ఈ పాత్ర పోషణ కోసం ట్రైనింగ్ తీసుకున్నారా?

అవును.. దాదాపు 18 నెలల పాటు కఠినమైన శిక్షణ తప్పలేదు. ముఖ్యంగా శారీరకంగా ఆ పాత్ర దృఢత్వం కనిపించాలి. అదనంగా 9 కిలోల బరువు పెరగాల్సి వచ్చింది.

లాక్ డౌన్ వల్ల మీ శరీరాకృతిని అంత కాలం ఎలా ఉంచగలిగారు?

అప్పటికే చాలా షూటింగ్ పూర్తిచేశాం. లాక్ డౌన్ లో ఉన్నప్పుడు బరువు తగ్గే అవకాశం కూడా రాలేదు.

ఈ సినిమాకు సంబంధించి ఇంకా ఏమైనా విశేషాలు చెబుతారా?

రాజమౌళి ఈ ఇంటర్వ్యూ చదివితే అతను గొడ్డలి పట్టుకుని నా వెంటపడతాడు. ప్రేక్షకులు థియేటర్లో సినిమా చూసి ఆ థ్రిల్ ఫీలవ్వాల్సిందే. ఇంతకుమించి నేను ఈ సినిమా గురించి ఏమీ చెప్పలేను.

ఇటీవలి కాలంలో ఇంగ్లీషు సినిమాలే కాకుండా అంతర్జాతీయ సినిమాలు చాలా వస్తున్నాయి. సినిమా పరిధి పెరగడం వల్ల కొత్త ప్రేక్షకులూ పుట్టుకొస్తున్నారు. చైనా లాంటి దేశాల్లో బాహుబలి బాగా వసూళ్లు సాధించింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే మీరు సినిమాలు చేస్తున్నారా?

బాహుబలి ప్రపంచ ద్వారాలు తెరిచింది. దంగల్ అనే సినిమా చైనాలో అత్యధిక వసూళ్లు సాధించింది. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇలాంటి సినిమాలకు ఆదరణ లభిస్తోంది. ఇది మంచి పరిణామంగా నేను భావిస్తున్నా. కానీ ప్రతి సినిమా అలా చేయలేదు. నటుడిగా మనకు అలాంటి అవకాశం వచ్చినప్పుడే ప్రతి ఒక్కరికీ ఆ కథను చూపించగలం.

మీరింకా ఏయే సినిమాలు చేస్తున్నారు? కొరటాల శివతో చేస్తున్నారని విన్నాం?

మేమిద్దరం కలిసి జనతా గ్యారేజ్ చేశాం. ఇది బ్లాక్ బస్టర్. ట్రిపుల్ ఆర్ తర్వాత మేము మళ్లీ కలుస్తున్నాం. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు స్క్రిప్టు దశలోనే ఉంది. ఆ తర్వాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కలిసి ఓ సినిమా చేయబోతున్నా.

కొరటాల శివ సినిమా పాన్ ఇండియా సినిమా అంటున్నారు?

పాన్ ఇండియా అనే పదాన్ని నేను ఇష్టపడను. ఇది వేపుడు వేసే పాన్ అనేలా నాకు వినిపిస్తుంది. మంచి సినిమాను మన దేశంలోని అనేక భాషల్లో చూపించే ప్రయత్నమిది. ట్రిపుల్ ఆర్ ను అలాగే చూపించబోతున్నాం.

కెమెరా వెనక్కి వెళ్లే ఆలోచన మేకేమైనా ఉందా?

ఇప్పటిదాకా నాకు అలాంటి ఆలోచన లేదు. నేను విధిని గట్టిగా నమ్ముతాను. నటుడిగా కథలో భాగం కావాలని కోరుకుంటాను.. కాబట్టి దర్శకత్వం చేపట్టే ఆలోచన లేదు. మంచి కంటెంట్ ను జనంలోకి తీసుకువెళ్లడానికి ఇష్టపడతాను. మన భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచంతో పంచుకునే కంటెంట్ గా అందించాలనుకుంటున్నాను.

హాలీవుడ్ కు వెళ్లే ఆలోచన ఉందా?

ఎందుకు వెళ్లకూడదు? మన భారతీయ నటుడు ప్రపంచ సినిమాల్లో నటించడానికి అవకాశం ఉంటే అది కచ్చితంగా గొప్ప పనే.

– హేమసుందర్ పామర్తి

courtesy: https://deadline.com/

Tags: jr ntr triple role moviejunior ntr interviewleotop
Previous Post

రుయా మృతుల వ్యవహారంలో కరోనా పేషెంట్ హేమవతి అరెస్ట్

Next Post

దినోత్సవం రోజే : కేజీహెచ్‌లో నర్సుల ఆందోళన

Related Posts

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

by లియో డెస్క్
November 6, 2026 7:52 pm

వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ - APPSC గ్రూప్-1 మెయిన్స్...

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

by లియో డెస్క్
October 21, 2026 7:07 pm

ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక వైసీపీ నేతలు మరోసారి తమ రాక్షస ఆనందాన్ని...

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

by లియో డెస్క్
September 15, 2026 5:36 pm

APలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది కూటమి సర్కార్. APPSCలో భారీగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి....

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

by లియో డెస్క్
May 13, 2026 6:52 pm

ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయా..గత పదేళ్లుగా కేంద్రంలోని కేంద్రంలోని బీజేపీతో లోపాయకారీ...

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

by లియో డెస్క్
March 26, 2026 7:57 pm

ఆ నియోజకవర్గంలో వైసీపీ ఒక్కసారి కూడా గెలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి అక్కడ...

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

by లియో డెస్క్
February 26, 2025 1:46 pm

మాజీ మంత్రి రోజా... మాజీ ఎమ్‌ఎల్‌ఏ కూడా... ఆమె ప్రస్తుతం రాజకీయాలలో ఉన్నానా..??...

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

by లియో డెస్క్
November 12, 2024 7:08 pm

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారమే......

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

by లియో డెస్క్
November 12, 2024 6:43 pm

ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత...

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

by లియో డెస్క్
November 12, 2024 3:48 pm

ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు పాలన ఇలా మొదలైందో లేదో... అలా...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

అన్నా.. యలహంక నాదే.. నీ గొడవతో పెళ్లి వేదిక మారుస్తున్నా.. షర్మిల సంచలనం..

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

కిక్ ఎక్కడుందో కనిపెట్టిన దేవ కట్టా?

ముఖ్య కథనాలు

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

సీమలో ‘రాయల్’ విజయం.. కూటమి దెబ్బకు బద్దలైన జగన్ ‘కోట’..

ఇది చంద్రబాబు విజన్‌.. ఆధారాలతో ఆనంద్ మహీంద్రా ట్వీట్..!

కుటుంబానికి పెద్దన్నగా ఉంటా..రాప్తాడు బాలిక ఫ్యామిలీకి లోకేష్ భరోసా.!

చంద్రబాబు మార్క్ లా అండ్ ఆర్డర్..ఆడబిడ్డ జోలికొస్తే అదే ఆఖరి రోజు..!

బీజేపీకి గుడ్‌బై..ఇండి కూటమికి జై కొట్టిన జగన్..!

30 ఏళ్ల తర్వాత పులివెందులకి ప్రజాస్వామ్యం..!

21 నెలలు.. 1.08 లక్షల టిడ్కో ఇళ్లు..కూటమి మార్క్ పాలన.!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

సినిమా

పక్కా డంప్‌తో పట్టుబడ్డ జగన్‌ వైపీఎస్‌.. గ్రూప్‌ 1 స్కామ్‌లో కీలక ఆధారాలు..!

రాత్రికి రాత్రే రోడ్డును తవ్వేసి..వైసీపీ మార్క్ విధ్వంసం..!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..APPSC ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్.!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

జనరల్

జగన్‌ని భయపెట్టిన విజయ్‌, కేటీఆర్‌.!

ఛీ.. ఛీ.. జగన్‌.. 70 సార్లు ఏడిపించాడు… విజయ సాయిరెడ్డి కన్నీరు

జగన్‌కు షర్మిల దెబ్బ…. చీరాలలో వైసీపీకి మూడో స్థానం

ఆఫ్రికా మాంగనీస్ నుండి ఏపీ లిక్కర్ పాలసీ వరకు.. అవినాష్ రెడ్డి అసలు కథ ఇదేనా..?

జగన్‌ నోటికి తాళం వేసిన లోకేష్‌… ఇక నో మోర్‌ కుట్ర….!

చెప్పారు…. చేస్తున్నారు…. మరో DSC నోటిఫికేషన్‌ విడుదల…!

రూ. 15 వేల కోట్లతో ఏపీకి కియా మరో గుడ్‌ న్యూస్‌.. అదిరిపడిన చంద్రబాబు, లోకేష్‌…!

పులివెందులలో ఎన్నికలు…. ఓటేయకుండా పెళ్లి వేడుకలో జగన్‌ భార్య భారతి….!

దారుణంగా పడిపోయిన వైసీపీ ఓట్‌ బ్యాంక్‌.. జగన్‌లో కలవరం..

చంద్రబాబుపై అంబటి ప్రశంసలు….. జగన్‌ సీరియస్‌ వార్నింగ్‌..పార్టీ నుండి వేటు.?

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist