నర్సుల సేవలను కొనియాడుతూ ప్రపంచ వ్యాప్తంగా నర్సుల దినోత్సవం చేసుకుంటోన్న తరుణంలో విశాఖ కేజీహెచ్‌లో 300 మంది సిబ్బంది ఆందోళనకు దిగారు.సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటూ నర్సులు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో తీసుకున్న కాంట్రాక్టు నర్సులను రెగ్యులర్ చేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఙప్తి చేశారు.ఐదేళ్ల కిందట చేరిన వారికి రూ.22500 జీతం,గత ఏడాది కాంట్రాక్టు పద్దతిలో తీసుకున్నవారికి రూ.34,000 జీతం ఇవ్వడంపై వారు ఆందోళనకు దిగారు.అందరికీ సమాన వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.200 మంది నర్సులు కరోనా బారిన పడ్డారని,పని ఒత్తిడి పెరిగిపోయిందని,కేజీహెచ్‌లో నర్సుల సిబ్బందిని పెంచాలని వారు ప్రభుత్వానికి విజ్ఙప్తి చేశారు.
ప్రభుత్వం పరిష్కరించాలి
తమ న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని విశాఖ కేజీహెచ్ నర్సులు డిమాండ్ చేశారు.కేజీహెచ్ లో 20 శాతం సిబ్బంది తక్కువగా ఉన్నారని,ఉన్నవారికి పనిభారం పెరిగిపోయిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సమాన వేతనం ఇవ్వడంతో పాటు,కొత్తగా సిబ్బందిని నియమించాలని వారు ప్రభుత్వానికి విజ్ఙప్తి చేశారు.











