‘ఇంద్రప్రస్థం’ ఇది కొత్త సినిమా టైటిల్. ఇదేమీ మహాభారతంలోని పాండవుల రాజధాని గురించిన కథ కాదు. ఇద్దరు స్నేహితుల మధ్య అనుబంధం గురించిన కథ. రాజకీయ మోహం.. స్నేహాన్ని మరిపించిన తర్వాత బద్ధ శత్రువులుగా మారిన స్నేహితుల కథ! నారా చంద్రబాబునాయుడు , వైఎస్ రాజశేఖర రెడ్డి ల మధ్య అప్పట్లో ఉండే స్నేహబంధం ఆధారంగా సినిమా తయారవుతోంది. దీనికి దర్శకుడు దేవ కట్టా. ఆయన ప్రకటించిన టైటిల్ ఇంద్రప్రస్థం.
చంద్రబాబు-వైఎస్సార్ స్నేహం : ఎవరి సొత్తు? ఎవరి హక్కు?
ఈ కథ గురించి ఇప్పటికే వివాదం రేగుతోంది. దర్శకుడు దేవకట్టా – నిర్మాత విష్ణు ఇందూరి ఈ విషయంలో తగాదా పడుతున్నారు. ఈ నేపథ్యంలో దేవ కట్టా.. తన చిత్రానికి సంబధించి ఒక వీడియో కూడా విడుదల చేశారు. ‘‘సత్యానికి రెండు పార్శ్వాలు (రెండు వైపులు) ఉండవు. సత్యం ఒకే పక్షంగా ఉంటుంది. మా చిత్రం థీమ్ పోస్టర్ ను ఓసారి చూడండి.. అంటూ ఆయన గ్రాఫిక్ డిజైన్ చేయించిన వీడియోను ట్విటర్ లో పోస్ట్ చేశారు. సురేష్ బొబ్బిలి ఈ టీజర్ కు సంగీతం అందించారు. ఈ చిత్రం వర్కింగ టైటిల్ ‘‘ఇంద్ర ప్రస్థం’’ అని ప్రకటించారు. హర్ష వి. ఈ చిత్రానికి నిర్మాత.
ప్రపంచంలో జరిగే పోటీలన్నింటికీ పర్సస్ ఒక్కటే. విన్నర్స్ ను ఎంచుకోవడం. విన్నర్స్ రన్ ద వరల్డ్. ఆ పోటీలో అనుకోకుండా ఇద్దరు స్నేహితులు ఎదురైతే ఆ ఆటకున్న కిక్కే వేరు. అనే వాయిస్ ఓవర్ తో సినిమా మీద ఇంటరెస్ట్ క్రియేట్ చేసేలాగా… ఈ వీడియో ఉంది.
There are no two sides to TRUTH, there is only one side!! Pls checkout the theme poster of INDRAPRASTHAM (working title)! @ProodosP @tchekuri @KrishnavijayL teaser score by #sureshbobbili https://t.co/mh0DZbY2VV
— deva katta (@devakatta) August 14, 2020
వీడియో ఇక్కడ చూసేయండి:
“There are no two sides to TRUTH, there is only one side!”
Here’s the theme poster of #Indraprastham (working title). Produced by Harsha.V & @tchekuri under @ProodosP. Remotely inspired by YSR and NCBN friendship/journey, written and to be directed by @devakatta. pic.twitter.com/FfmQ59ILdi— Proodos_productions (@ProodosP) August 14, 2020