మలినేని గోపీచంద్.. మాస్ మహారాజా రవితేజతో క్రాక్ మూవీని తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా రిలీజైన క్రాక్ మాస్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ సాధిస్తూ.. దూసుకెళుతుంది. రవితేజను ఎలా చూడడానికి ఆడియన్స్ ఇష్టపడతారో.. అలా చూపించడంతో క్రాక్ ఆడియన్స్ కి భలే నచ్చేసింది. ఈ సినిమాతో రవితేజ – మలినేని గోపీచంద్ హ్యాట్రిక్ సాధించారు.

గతంలో వీరిద్దరూ కలిసి డాన్ శీను, బలుపు సినిమాలు తీశారు. ఆ రెండు సినిమాలు హిట్టే. మొత్తం వీరిద్దరూ కలిసి పని చేసిన మూడు సినిమాలు సక్సస్ సాధించడంతో మలినేని గోపీచంద్ కి డిమాండ్ బాగా పెరిగింది. మాస్ డైరెక్టర్స్ వి.వి.వినాయక్, బోయపాటి శ్రీను కెరీర్ లో కాస్త వెనకబడడంతో సరైన మాస్ సినిమాని తీసే డైరెక్టర్స్ కొరత ఏర్పడింది. ఇలాంటి టైమ్ లో మలినేని గోపీచంద్ ఫుల్ మీల్స్ అనిపించేలా మాస్ సినిమా ఇవ్వడంతో నిర్మాతలు గోపీచంద్ కోసం క్యూకడుతున్నారు.
టాప్ స్టార్లు బిజీగా ఉండడంతో మిడిల్ రేంజ్ హీరోలు మలినేనితో వర్క్ చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. మరో సక్సస్ అందిస్తే.. అప్పుడు స్టార్ హీరోలు సైతం మలినేని వెంటపడడం ఖాయం. ఒక సినిమా తర్వాత మరో సినిమా చేయడానికి వెతుక్కునే మలినేని గోపీచంద్ కి ఇప్పుడు వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. మొత్తానికి గోపీచంద్ దశ తిరిగింది. అదీ.. సంగతి.











