తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ‘మాస్టర్’. ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజైంది. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా మాస్టర్ మూవీ భారీ స్ధాయిలో రిలీజైంది. విజయ్ కి భారీ క్రేజ్ ఉండడం.. లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసి ఖైదీ బ్లాక్ బస్టర్ అవ్వడం.. విజయ్ – లోకేష్ కనకరాజ్ కాంబో మూవీ అయిన ‘మాస్టర్’ సంక్రాంతికి రావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అంచనాలకు తగ్గట్టుగానే ‘మాస్టర్’ దూసుకెళుతున్నాడు. ఒక్క తమిళనాడులోనే 25కోట్లు కలెక్ట్ చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పుడు ఈ మూవీ బాలీవుడ్ లో రీమేక్ కానుందని తెలిసింది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో ఇండోమోల్ సైన్ ఇండియా, మురద్ కేతాని, 7 స్ర్కీన్ స్టూడియో సంయుక్తంగా నిర్మించనున్నాయి. ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఈ మూవీ బాలీవుడ్లో రీమేక్ కానున్నట్టు కన్ ఫర్మ్ చేశారు.
అయితే.. మాస్టర్ బాలీవుడ్ రీమేక్ లో నటించే నటీనటులు ఎవరు అనేది ఇంకా కన్ ఫర్మ్ కాలేదు. త్వరలోనే ఎవరు నటించనున్నారు అనేది ఫైనల్ చేయనున్నారు. విజయ్ – విజయ్ సేతుపతి మధ్య వచ్చే సన్నివేశాలు, విజయ్ ని సరికొత్తగా చూపించిన విధానం ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యాయి. మరి.. సౌత్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘మాస్టర్’ నార్త్ ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి.











