భూకబ్జాలు అరికట్టడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నా ఫలితం కనిపించడం లేదు. సర్వే చేయించుకుని సరిహద్దులు నిర్ణయించుకుని ఫెన్సింగ్ వేయించుకున్నా వాటికి రక్షణ లేకుండా పోతోంది. మా ప్రాంతాల్లో చాలా భూములు దురాక్రమణకు గురవుతున్నాయి. చెరువులు, శిఖం భూములు, శ్మశానవాటిక స్థలాలను కూడా వదిలిపెట్టడం లేదు. ముఖ్యంగా రాజకీయ పార్టీల అండదండలతోనే కబ్జాదారులు చెలరేగిపోతున్నారు. రాజకీయం, రౌడీయిజం కలవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటిదాకా జరిగిన కబ్జాలపై దర్యాప్తు జరపాలి. ముఖ్యంగా సీఎం కేసీఆర్ దీనిమీద దృష్టిపెడితే బాగుంటుంది. ఆయన ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంటే కబ్జాదారుల ఆటలు సాగవు. అధికార పార్టీ నేతల అండదండలతోనే ఈ ఆక్రమణలు జరుగుతున్నాయనిపిస్తోంది.
– వెంకన్న, కరీంనగర్
ఎందులోనైనా!.. ఇండియన్ల తర్వాతే అమెరికన్లు!
Indians Have The Upper Hand In All Fields Than Americans...