బైడెన్ గెలుపుతో రెండు తెలుగు రాష్ట్రాల లోని విద్యార్థులకు, ఉద్యోగస్తులకు అమెరికాలో విద్యా, ఉపాధి కి మెరుగైన అవకాశాలు ఏర్పడుతాయని.. నాట్స్ మాజీ అధ్యక్షులు మన్నవ మోహన కృష్ణ (U.S.A) తెలియజేశారు.
బైడెన్ అధ్యక్షులు కావడంతో అమెరికా భారత్ సంబంధాలు మరింత మెరుగు పడతాయన్న ఆశాభావం అందరిలో ఉందని మోహనక్రిష్ణ అన్నారు. ట్రంప్ ప్రభుత్వ హయాంలో వలస విధానంలో అనుసరించిన కఠిన నిబంధనల వలన భారతీయ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. రాబోయే కొత్త ప్రభుత్వం హయాంలో భారత్ విద్యార్థులకు F-1 స్టూడెంట్ వీసా విషయంలో, అలాగే భారతీయులకు అమెరికాలో ఉపాధి కల్పించే H-1B వీసాల విషయంలోనూ ఇండియన్స్ కు మేలు జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం వ్యక్తం చేశారు.
జో బైడెన్, కమలా హ్యారీస్ ఆధ్వర్యంలో భారత్ – అమెరికా వాణిజ్య, వ్యాపార సంబంధాలు మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
బైడెన్ నేతృత్వంలో అమెరికా ఎదురుకొంటున్న కోవిడ్ మహమ్మారి, ఆరోగ్య భద్రత, ప్రతి పౌరుడికీ వైద్య సదుపాయాలు కల్పించే చట్టం, వలసలు, జాతి వివక్షత, జెండర్ సమానత్వం, పెరుగుతోన్న ఆర్ధిక అసమానతలు, మిత్ర దేశాలతో సత్సబంధాలు వంటి అనేక విషయంలో పరిష్కారం దొరుకుతుందని ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి.
అమెరికా దేశ చరిత్రలో మొట్ట మొదటిసారిగా ఒక మహిళ ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారీస్ గెలవడం, ఆమె భారతీయ సంతతి మహిళ కావడం ప్రవాస భారతీయులు అందరికి గర్వకారణం అని నాట్స్ పూర్వఅధ్యక్షులు మన్నవ మోహన కృష్ణ అభినందనలు తెలియజేశారు.