ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లి నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయిన తెలుగు మహిళలను దుబాయ్ తెలుగుదేశం నాయకులు గుదె నాగార్జున చౌదరి, ఖాథర్ భాషా షేక్, వాసు పోడిపిరెడ్డిలు ఆదుకున్నారు. వారిని తమ సొంత ఖర్చులతో ఇండియాకు పంపించారు.
వివరాల్లోకి వెళితే..
రాయచోటి పరిసర ప్రాంతాల్లోని మహిళలు ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి అక్కడి వారు, ఇండియాలోని నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయారు. దుబాయ్‌లో వారికి పని చూపించలేదు, చేసిన పనికి డబ్బులు ఇవ్వలేదు. దీంతో మహిళలు తిండి లేకుండా ఇబ్బందులు పడుతున్న విషయం తెలుగుదేశం కువైట్ వేల్ఫేర్ కో ఆర్డినేటర్ గుదె నాగార్జున చౌదరి దృష్టికి రాగా వేంటనే ఆయన స్పందించారు. విషయాన్ని దుబాయ్‌లోని తెలుగుదేశం నాయకులు ఖాధర్ భాషా , వాసు పోడిపిరెడ్డిల దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందించి సొంత నిధులు దాదాపు లక్ష రూపాయలు పెట్టి బాధిత మహిళలను ఇండియాకు పంపించారు. ఈ సందర్భంగా బాధితురాళ్లు మాట్లాడుతూ.. ఏజెంట్ తమను అనేక రకాలుగా వేధించి బెదిరించాడని, తాను రాయచోటి ఎమ్మెల్యే అనుచరుడిని అంటూ తమను అనేక విధాలుగా బాధపెట్టారన్నారు. తిండి, ఫోన్‌లు కూడ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారన్నారు. ఇండియాలో కూలి పనైనా చేసుకుని బతుకుతామని, ఇక్కడ ఇబ్బందులు పడలేమన్నారు. తమతో డ్యూటీలు 24 గంటలు చేయించుకుని సరిగా డబ్బులు కూడ ఇవ్వ లేదన్నారు. తమ ప్రాంతంలో ఎవరూ ఏజెంట్‌ల మోసాలకు బలవుకుండా చూస్తామన్నారు. తమ లాగా మోసపోయిన వారు ఇంకా ఇరవై మంది పై చిలుకు ఉన్నారని, వారిని కుడా కాపాడాలని ప్రాధేయపడ్డారు. 500 దినార్లు సొంత డబ్బులు ఇచ్చి తమను ఇండియాకు పంపిన తెలుగుదేశం పార్టీ నాయకులు నాగార్జున, ఖాధర్ భాషా , వాసు పోడిపిరెడ్డిలకు రుణపడి ఉంటామన్నారు. మిగతా బాధితులను కూడ రక్షించాలని వారు వేడుకున్నారు.