Sirisha Bandla :
అవకాశాల్లో సగం.. ఆకాశంలోనూ సగం అని నిరూపించుకుంటున్నారు నేటి తరం అమ్మాయిలు. సాధారణంగా తెలుగింటి అమ్మాయి అనగానే.. ఎన్నో ఆంక్షలు.. మరెన్నో సవాళ్ల మధ్య జీవించాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఎంతో శ్రమించినా.. లక్ష్యానికి అడుగు దూరంలోనే ఉంటారు. కానీ మన తెలుగంటి అమ్మాయి బండ్ల శిరీష ఎన్నో సవాళ్లను అధిగమించి.. నేడు అంతరిక్షయానం చేయబోతోంది. రోదసీలోకి అడుగుపెట్టే తొలి తెలుగమ్మాయిగా చరిత్ర సృష్టించబోతోంది. గుంటూరు జిల్లాకు చెందిన బండ్ల శిరీష్ ఈ ఘనత సాధించనున్నది. ఇప్పుడు ప్రతి తెలుగువారు గర్వంగా తలెత్తి ఆకాశం వైపు చూస్తున్నారు
Sirisha Bandla To Fly Into Space On Virgin Galactic Spacecraft Today :
నేడు అంతరిక్షంలోకి..
వర్జిన్ స్పేస్ మిషన్‌తో పేరు చేపట్టిన ప్రాజెక్ట్ ఇది. జెఫ్ బెజోస్ కంటే కూడా ముందే అంతరిక్షంలో ప్రయాణించడానికి ఉద్దేశించిన మిషన్ ఇది. దీనికి రిచర్డ్ బ్రాస్నన్ సారథ్యాన్ని వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వర్జిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత ఈ రిచర్డ్ బ్రాస్నన్. వర్జిన్ గెలాక్టిక్, వర్జిన్ ఆర్బిట్.. వంటి స్పేస్ రీసెర్చ్ సంస్థలు ఈ గ్రూప్‌లో ఉన్నాయి. దీని తరఫున ఆరుగురు సభ్యులతో కూడిన ఓ బృందాన్ని రిచర్డ్ బ్రాస్నన్ సిద్ధం చేసుకున్నారు. ఆదివారం వీళ్లంతా అంతరిక్షంలో దూసుకువెళ్లనున్నారు. అందులో ఒకరు బండ్ల శిరీష.
చరిత్రలో తనకంటూ పేజీ
ఇంతకుముందు రాకేశ్ శర్మ, కల్పనా చావ్లా, భారత-అమెరికన్ సునీతా విలియమ్స్ రోదసిలోకి వెళ్లి వచ్చారు. ఆ తర్వాత నాలుగో వ్యోమగామిగా శిరీష సరికొత్త రికార్డును క్రియేట్ చేయనున్నారు. తెలుగు వారి విషయానికి వస్తే.. బండ్ల శిరీష అంతరిక్షంలోకి వెళుతున్న తొలి తెలుగు అమ్మాయిగా చరిత్ర పుటల్లోకి ఎక్కనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో జన్మించిన బండ్ల శిరీష తల్లిదండ్రులతో పాటు అమెరికాలోని హ్యూస్టన్ లో సెటిల్ అయ్యారు. పర్‌డ్యూ విశ్వవిద్యాలయం నుంచి ఏరోనాటికల్-ఆస్ట్రోనాటికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. ఆ తర్వాత జార్జ్ వాషింగ్టన్ వర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె వర్జిన్ గెలాక్టిక్‌లో ప్రభుత్వ వ్యవహారాలు, పరిశోధన కార్యకలాపాల విభాగానికి ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ‘‘అంతరిక్షయానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న కంపెనీలో, యూనిటీ-22 సిబ్బందిలో భాగస్వామి కావడాన్ని అత్యంత అదృష్టంగా భావిస్తున్నాను’’ అని శిరీష ట్వీట్ చేశారు.
I am so incredibly honored to be a part of the amazing crew of #Unity22, and to be a part of a company whose mission is to make space available to all. https://t.co/sPrYy1styc
— Sirisha Bandla (@SirishaBandla) July 2, 2021