ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో టీడీపీ యువనేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీకి అపాయింట్మెంట్ తీసుకున్నారు.. మంగళవారం నజీర్ని కలిసి తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై పెట్టిన, పెడుతున్న అవినీతి కేసులపై ఫిర్యాదు చేయనున్నారు.. జగన్ సర్కార్ పిచ్చి పట్టినట్లు వరసగా ఫైల్ చేస్తున్న ఈ కేసులు కేవలం రాజకీయ కక్షతో కూడుకున్నవని, వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కి ఫిర్యాదు చేయనున్నారు లోకేష్..
గవర్నర్ నజీర్‌తో లోకేష్ భేటీకి అత్యంత ప్రాముఖ్యత ఏర్పడనుంది.. సుప్రీంలో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై తీర్పు వెలువడనుంది.. ఈ కేసులో ఇప్పటివరకు సీఐడీ ఎలాంటి ఆధారాలు చూపించలేదు.. మనీ ట్రయిల్ ప్రస్తావనే లేదు.. దీంతో, ఈ కేసు వీగిపోయే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు..
మరోవైపు, హైదరాబాద్‌లో ప్రధాని మోదీ బీజేపీ బీసీ గర్జన సభకు వస్తున్నారు. అక్కడ ఆయనతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు.. ఇదే రోజు ఏపీలో గవర్నర్‌తో లోకేష్ భేటీ అవుతుండడంతో వైసీపీకి అంతు చిక్కడం లేదు.. ఈ రెండు పరిణామాలను వేరువేరుగా చూడాల్సి ఉన్నా… ఈ రెండింటికీ లింక్ ఉందని భావిస్తున్నారు రాజకీయ పరిశీలకులు.. గత కొన్ని రోజులుగా లోకేష్ ఢిల్లీలో ఉన్నారు.. ఆ మధ్య కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.. బాబు అరెస్ట్ తర్వాత పరిణామాలను లోకేష్.. అమిత్ షాతో పంచుకున్నారు. తాజాగా కేంద్ర ఇంటెలిజెన్స్ రిపోర్టులు కూడా అందుకున్న బీజేపీ పెద్దలు రివర్స్ గేర్ వేస్తున్నారని, జగన్ కి సహాయ సహకారాలు దక్కకుండా చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది..
ఇదే సమయంలో జగన్ సర్కార్‌కి అందాల్సిన 5 వేల కోట్ల నిధులను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అడ్డుకుంది. కేంద్ర పథకాలకు జగన్ స్టిక్కర్లు, ఫోటోలు వేయడంపై కేంద్ర అధికారులు భగ్గుమన్నారు.. ఏపీకి రావలసిన 5 వేల కోట్లను నిలిపివేశారు.. ఈ అంశం కూడా జగన్ సర్కార్‌ని డైలమాలో పడేసింది.. నాలుగన్నరేళ్లుగా ఇదే జరుగుతున్నా, ఇప్పుడే తమకు కేంద్రం హ్యాండ్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించుకుంటున్నారు వైసీపీ నేతలు.. మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చిన చంద్రబాబు తెరవెనక వ్యూహం తిప్పారా?? ఈ వరస ఘటనలకి, దీనికి లింక్ ఉందా?. అని తరచి తరచి శోధించుకుంటున్నారు..
మొత్తమ్మీద, రెండు రోజుల్లో చకచకా జరుగుతన్న పరిణామాలు వైసీపీని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.. గవర్నర్‌తో లోకేష్ భేటీ తర్వాత ఏపీ రాజకీయాలు ఎలాంటి టర్న్ తీసుకుంటాయో చూడాలి..