ఏపీలో చిత్ర విచిత్ర రాజకీయాలు జరుగుతున్నాయి.. చిన్న ఆధారం కూడా లేకుండా కేసులు నమోదవుతున్నాయి. ఏకంగా ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేస్తున్నారు.. వారిని జైలుకు పంపుతున్నారు.. భారీ అవినీతి జరిగిందని చెబుతారు.. ఆధారాలున్నాయంటారు.. కానీ, మనీ ట్రయిల్ చూపించరు. ఇటు చార్జ్ షీట్ నమోదు కాదు.. ఇలాంటి వింతవింతలకు ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కే చెల్లుతుంది.. తాజాగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎలాంటి ఆధారం లేకుండా అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపారు.. ఇటీవల ఆయన మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చారు…
బెయిల్‌పై బయటకు వచ్చిన చంద్రబాబు.. సంచలన నిర్ణయం తీసుకున్నారు.. తనతోపాటు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అధికారిక హోదాలో కీలక నిర్ణయాలు తీసుకున్న సీనియర్ ఐఏఎస్ అధికారులను కూడా ఈ కేసులో చేర్చాలని సీఐడీకి తన అడ్వకేట్‌లతో ఫిర్యాదు చేయించారు.. ఈ ఒక్క నిర్ణయంతో 12 మంది ఐఏఎస్ అధికారులు ఉలిక్కిపడ్డారు. కేవలం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాల మేరకే నిధులు కేటాయించారనే ఆరోపణలు చేసింది సీఐడీ.. బాబు తరఫు అడ్వకేట్ ఫిర్యాదు విచారణతో ఈ అధికారులను కూడా విచారించనున్నారు.. వాళ్లను విచారిస్తే చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదనే ఆధారాలు బయటకు వస్తాయి.. విచారణ జరపకపోతే, కేసు వీగిపోనుంది.
బాబు నిర్ణయంతో ఈ 12 మంది ఐఏఎస్ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.. వీరిలో జగన్ సర్కార్ డ్రామాలు ఆడితే ఆడేది ఎవరు?? నాడు ఏం జరిగిందో అసలు నిజాలు బయటపెట్టేది ఎవరు.. అనేది కీలకంగా మారనుంది.. ఇప్పుడు ఈ 12 మంది ఐఏఎస్ అధికారులు సీఐడీ లేదా కోర్టు ముందు ఎలాంటి సాక్ష్యాధారాలు వెల్లడిస్తారు.? అనేది ఆసక్తికరంగా మారుతోంది.. వారు అబద్దం చెబితే ఆధారాలు చూపించాలి…. నిజం చెబితే కేసు ఫైల్ చేసిన అధికారులకు చుట్టుకోవడం గ్యారంటీ.. ఇటు, జగన్ మెడకి చుట్టుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు.. కేవలం వేధింపుల పర్వం కోసమే ఈ కేసుని ఫైల్ చేశారని ఈ ఒక్కరిలో ఎవరు లీక్ చేసినా… ఓ సంచలనంగా మారుతోంది..
మొత్తమ్మీద, స్కిల్ డెవలప్ మెంట్ కేసు కొత్త మలుపులు తిరిగేలా కనిపిస్తోంది.. ఈ కేసుని నేను వదలా అని చంద్రబాబు భీష్కిస్తున్నట్లు కనిపిస్తోంది.. ఏది నిజమో, ఏది అబద్ధమో తేల్చిచెప్పాల్సిన అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారట.. అందుకే, ఆయన ఈ కేసుపై అమీతుమీ తేల్చుకోవడానికే రెడీ అయ్యారని టీడీపీ వర్గాల నుండి అందుతోన్న సమాచారం.. మరి, రాబోయే రోజులలో ఏం జరుగుతుందో చూడాలి..