సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. తర్వాత పరశురామ్ దర్శకత్వంలో సర్కారువారి పాట సినిమాను ట్రాక్ ఎక్కించే పనిలో ఉన్నాడు. లాక్ డౌన్ లేకపోతే.. ఎప్పుడో సెట్స్ మీదకు వెళ్ళాల్సింది ఈ సినిమా. చాలా లేటుగా ఇప్పటికి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళబోతోంది. జనవరి 4 న అమెరికాలో ‘సర్కారువారి పాట’ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించిన వీసా వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం చిత్ర బృందం కన్నా ముందే మహేశ్ అమెరికాలో కాలు పెట్టబోతున్నాడట. ఈ క్రిస్మస్ అమెరికాలో జరుపుకోవాలని, న్యూ ఇయర్ కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకోవాలన్నది మహేశ్ ప్లాన్ . అందుకే తన ఫ్యామిలితో సహా అతడు డిసెంబర్ 24నే అమెరికా ఫ్లైట్ ఎక్కనున్నాడని టాక్. డిసెంబర్ 30న మిగిలిన చిత్ర బృందం అమెరికా పయనమవుతుందట.
అమెరికా షెడ్యూల్ దాదాపు 45 రోజుల పాటు జరుపుకోనుందట. కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా కథ ఒక బ్యాంక్ స్కామ్ నేపథ్యంలో సాగుతుందట. ఇందులో విలన్ గా ఉపేంద్రను కానీ, అరవింద స్వామిని గానీ ఎంపిక చేస్తారట. తమన్ సంగీతం అందించబోతున్న సర్కారు వారి పాట మహేశ్ బాబుకి ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.











