అపోలో తుదిశ్వాస..
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ( 49 ) కన్నుమూశారు. ఇవాళ ఉదయం గుండెపోటు రావడంతో హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. ఆత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. అయితే ఆసుపత్రికి తీసుకొచ్చే మార్గమధ్యంలోనే తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది! దీంతో అత్యవసర చికిత్స అందినప్పుటికీ ప్రాణం నిలబడలేదు. ఆయన మరణించారన్న విషయాన్ని గౌతమ్ భార్యకు అపోలో వైద్యులు సమాచారం ఇచ్చారు. కాగా మంత్రి గౌతమ్ గత వారం రోజుల పాటు దుబాయ్ పర్యటన ముగించుకొని ఆదివారం హైదరాబాద్ కు తిరిగి వచ్చారు.
పలువురు ప్రముఖులు నివాళులు..
మంత్రి గౌతమ్‌రెడ్డి మృతి పట్ల రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డిలతో పాటు మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, నివాళులర్పించారు. రాష్ట్రప్రతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్,అచ్చెన్నాయుడు, సోమిరెడ్డి తదితరులు నివాళులర్పించారు.
Must Read:-మేకపాటి గౌతం రెడ్డికి నివాళులు అర్పించిన నారా లోకేష్!











