ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మృతిపట్ల తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఫిట్నెస్ కి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే మంత్రి గౌతమ్ రెడ్డి గారికి గుండెపోటు రావడం అత్యంత భాదాకరమని లోకేష్ పేర్కొన్నారు. విదేశాలలో ఉన్నత విద్యాభ్యాసం చేసి వచ్చినా వినయం, విధేయతలకు గౌతమ్ రెడ్డి చిరునామాగా ఉండేవారని ఆయన తెలిపారు. ఐదు పదుల వయస్సులోనే హుందా గల రాజకీయవేత్తగా గౌతమ్ రెడ్డి పేరుగాంచారని.. అలాంటి వ్యక్తి మనకి భౌతికంగా దూరం కావడం తీరని విషాధమని లోకేష్ అన్నారు.. అదేసమయంలో మేకపాటి కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు..












