టాలీవుడ్ కింగ్ నాగార్జున సంక్రాంతికి బంగార్రాజు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆశించినట్టుగానే ప్రేక్షకులను ఆకట్టుకుని విజయం సాధించారు. ప్రస్తుతం నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ఘోస్ట్. ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నాగార్జున ఇప్పటివరకు చేయని విధంగా యాక్షన్ చేస్తుండడం.. నాగార్జున సరికొత్త లుక్ లో కనిపిస్తుండడం విశేషం. ఈ మూవీ ఫస్ట్ లుక్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో ఘోస్ట్ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ ఘోస్ట్ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని డిసైడయినట్టు తెలుస్తోంది. దీనికి కారణం ఏంటంటే.. నాగార్జున బిగ్ బాస్ ఓటీటీకి కూడా హోస్ట్ చేయాల్సి ఉంది. ఈ నెలాఖరు నుంచి గానీ లేదా మార్చ్ నుంచి నుంచి గానీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ మొదలు కానుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో షూట్‌లో నాగార్జున పాల్గొంటున్నారని తెలిసింది. ఇది పూర్తి కాగానే ఘోస్ట్ చిత్రీకరణ కోసం చిత్రబృందం దుబాయికి వెళ్లబోతున్నారు.
మూడు వారాల పాటు అక్కడ షెడ్యూల్‌ను పూర్తి చేయనున్నట్టు సమాచారం. ఈ షెడ్యూల్ నాగార్జున, సోనాల్ చౌహాన్ మరి కొంత మంది ఫైటర్స్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే… సమ్మర్‌లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు వచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. బంగార్రాజు సక్సస్ సాధించిన నాగార్జున ఘోస్ట్ మూవీతో కూడా సక్సెస్ సాధిస్తారేమో చూడాలి.











