కృష్ణా జిల్లా వైసీపీ కుత్తేగాళ్ళకు,గన్నవరం పిల్ల సైకోకు ఇక ఉచ్ఛే..!
ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రను చూసి కృష్ణాజిల్లా వైసీపీ నేతలు గజగజ వణికిపోతున్నారు.
విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి ఉమ్మడి కృష్ణాజిల్లాలోకి ప్రవేశించిన లోకేష్ యువగళం పాదయాత్రను చూసి ఏపీలోని అధికార పార్టీకీ గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. బ్యారెజ్ అన్నీ గెట్లు ఎత్తేస్తే .. పరుగులు పెట్టే కృష్ణమ్మ మాదిరిగా ప్రకాశం బ్యారెజ్ పై పాల్గొన్న అసంఖ్యాక శ్రేణులు కదులుతున్న తీరుకు అద్దం పట్టింది. అక్కడ నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. దారి పొడవును లోకేష్ కు జన నీరాజనాలు పట్టారు. 40 ఏళ్ళ క్రితం దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్తూరు జిల్లాలోని కుప్పంలో సాగించిన బస్సు యాత్రలో సీన్.. లోకేష్ పాదయాత్రలో మళ్లీ రిపిట్ అయ్యింది. ఆనాడు ఎన్టీఆర్ కోసం ప్రజలు రాత్రులు నిద్రపోకుండా ఎలా ఎదురుచూశారో.. లోకేష్ పాదయాత్రలో పాల్గొనేందుకు, లోకేష్ ను చూసి కరచాలనం చేసేందుకు నేడు కృష్ణాజిల్లా ప్రజలు ఉత్సాహం చూపారు. అయితే మంగళవారం గన్నవరం నియోజకవర్గంలో సాగిన పాదయాత్ర హైలెట్ అని చెప్పాలి. పాదయాత్ర అనంతరం స్థానిక చిన అవుటుపల్లి వద్ద భారీ బహిరంగ సభలో అద్దిరిపోయే స్పీచ్ ఇచ్చాడు లోకేష్. హై ఓల్టేజ్ స్పీచ్ తో.. సైకో జగన్, పిల్ల సైకో వంశీ, సన్నబియ్యం సన్నాసి.. వెర్రిపుట్టి రోడ్లంపటి తిరిగే నాని, జోకర్ జోగిలపై విరుచుకు పడ్డారు లోకేష్.
గుడివాడ సన్నబియ్యం సన్నాసిని నడిరోడ్డుపై కట్ డ్రాయర్ పై నిలబెట్టి.. కొట్టుకుంటూ ఈడ్చుకేళ్ళే రోజును మీరు చూస్తారని శ్రేణులకు హామీ ఇచ్చారు. అలానే కృష్ణా జిల్లా వైసిపి నేతలు పిరికి సన్నాసులతో పోల్చాడు. ఇతర జిల్లాల్లో వైసిపి కుక్కలు నా పాదయాత్ర పూర్తయిన తరువాత మొరిగేవని.. కృష్ణా జిల్లా వైసిపి కుక్కలు జిల్లా లో అడుగుపెట్టకముందే ప్యాంట్లు తడుపుకున్నారని ఎద్దేవా చేశాడు. కృష్ణా జిల్లాకి చంద్రబాబు 17 వేల మందికి ఉద్యోగాలు కల్పించే హెచ్సిఎల్ తీసుకొస్తే జగన్ క్యాసినో, పేకాట క్లబ్లు తీసుకొచ్చాడని విమర్శించారు. జక్కంపూడి ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడమేకాక.. జెడ్ సిటీ పేరుతో 7 వేల ఇళ్లు నిర్మించామని గుర్తు చేశారు. అలానే మల్లవల్లిలో మోడల్ ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు చేసి అశోక్ లేలాండ్, మోహన్ స్పిన్నింగ్ వంటి పరిశ్రమలతో దాదాపు 70 ప్లాస్టిక్ పరిశ్రమలు, 45 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, 694 చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలకు భూములు కేటాయిస్తే.. నేడు జగన్ ఆ కంపెనీలను ఇతర రాష్ట్రాలకు తరిమేస్తున్నాడని వాపోయ్యారు.
పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గ ప్రజలకు తాగు నీరుతో పాటు 4.90 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే చింతలపూడి ఎత్తిపోతలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఆనాడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూ.4,909 కోట్లతో ప్రారంభించిన చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను జగన్ నిలిపి వేశాడని చెప్పుకొచ్చారు. తన తల్లిని, అమరావతి స్ఫూర్తిని అవమానించిన ఏ ఒక్కరిని వదిలి ప్రశక్తే లేదన్నారు. జగన్ కు అన్నం కన్నా.. ఇసుక బొక్కడం అంటేనే ఇష్టమని.. ఈ నాలుగేళ్ళల్లో దాదాపు రూ. 5 వేల కోట్లకు పైగా ఇసుకపై అక్రమంగా సంపాదించి.. భవన కార్మికుల పొట్టకొట్టారని వివరించారు.
తెలుగు దేశం పార్టీలోకి కంచు కోటలాంటి కృష్ణాజిల్లాకు పూర్వ వైభవం తీసుకురావాలంటే 16 అసెంబ్లీ స్థానాలకు గానూ 16 అసెంబ్లీ స్థానాల్లో పార్టీని గెలిపించాలని కోరారు. లోకేష్ స్పీచ్ అద్యంతం శ్రేణులను ఉత్సాహపర్చడమేకాక.. ప్రజలను ఆలోచింపజేసేలా సాగింది. జగన్ ప్రభుత్వంలో పడుతున్న అష్టకష్టాలను తలచుకుని.. మార్గంచూపే నాయకుడు లోకేష్ రూపంలో కనిపిస్తున్నాడని ప్రజలు సంబరపడితున్నారు. స్వచ్ఛంధంగా తరలివచ్చిన ప్రజలకు, పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ లోకేష్ యువగళం బహిరంగ సభను ముగించుకుని 192వ రోజు చిన అవుటుపల్లి నుంచి ప్రారంభమయ్యే పాదయాత్రకు సన్నద్ధమవుతున్నారు.