విశాఖలో వైసీపీ భూదందా.. తుర్లవాడకు తూట్లు.. 75 వేల కోట్లు హాంఫట్..!
రుషి కొండను బోడి గుండు చేశారు. తుర్లవాడ కొండను A2కు అప్పగించారు. గ్రీన్ ట్రైబ్యునల్ నిబంధనలకు సైతం తూట్లుపొడుస్తున్నారు.రూ.75 వేల కోట్లు విలువ చేసే భూములను కొల్లగొట్టారు.
విశాఖలో సహజ సంపదగా ఉన్న ఎర్రమట్టిని దోచారు. సర్వతోముఖంగా ఉన్న ప్రభుత్వం భూములను లూటీ చేశారు. వేల ఎకరాలను అక్రమించుకుని.., వాటిని కాపాడుకునేందుకే విశాఖే రాజధాని అంటూ జగన్ పాటపాడుతున్నారు. దసరాకు కొత్త అల్లుడు మాదిరిగా ఈ అక్రమాస్తుల చక్రవర్తి.. మరో లక్ష కోట్లను భూదందాలపై సంపాదించాలనే లక్ష్యంతో కుటుంబ సమేతంగా విశాఖకు మకాం మార్చేందుకు యత్నాలు సాగిస్తున్నారు.
భీమునిపట్నం తుర్లవాడ కొండ.. సనాతన ఆధ్మాత్మిక కేంద్రం.., ప్రకృతి రమణీయకు, పర్యాటకానికి పెట్టింది పేరు. హిందూ ధర్మాన్ని, సంస్కృతి, సాంప్రదాలను ధ్వంసం చేయడం మాత్రమే తెలిసిన జగన్ రెడ్డికి … ఇవేమీ అర్థంకావు. సాక్ష్యాత్తు ఉగ్ర నారసింహుడు అడుగుపెట్టిన తుర్లవాడ కొండను నేరస్తుడైన విజయసాయి రెడ్డికి కట్టబెట్టాడు. ఎంతో మహిమ కలిగి తుర్లవాడ కొండపై దాదాపు 120 ఎకారాలు.., దాదాపు రూ. 300 కోట్లు విలువచేసే భూములను కాజేసేందుకు కుట్రలను షురూ చేశారు జగన్.
తుర్లవాడ కొండపై నారసింహుడు పాదాలు ఉన్నాయి. ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రజలు ఈ కొండను పూజిస్తూ ఉంటారు. ఈ కొండను కబ్జా చేసేందుకు విజయ్ సాయి రెడ్డి తన గ్యాంగ్ తో రెండు రోజులు క్రితం పరిశీలించడానికి వెళ్ళాడు. ఆనాటి నుంచే ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఇప్పటికే హిందూ ధర్మం సంబంధించిన రథాలు.., దేవాలయాలు ధ్వంసం అవుతుండగా.. మరోసారి విశాఖపట్నంలో ఎంతో మహిమాన్వితమైన తుర్లవాడ కొండను కబ్జా చేసేందుకు జగన్ అండ్ టీం బయలుదేరిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తుర్లవాడ కొండపై విజయ్ సాయి రెడ్డి కూతురు ప్రైవేటు యూనివర్సిటీ కడుతుందని , దానికి కాబట్టి 120 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారని టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ప్రతిపాదనలు పెట్టిందే తడువుగా.. ఆఘమేఘాలపై జగన్ ప్రభుత్వం స్పందించి రూ. 300 కోట్ల విలువైన భూమిని కేవలం రూ. 20 కోట్లకే కట్టబెట్టింది. ఇప్పటికే దాదాపు 70 వేల కోట్లు విలువ చూసే భూములను అప్పనంగా కొట్టేసిన జగన్, విజయ సాయి రెడ్డిలు తాజాగా తుర్లవాడ కొండపై కన్నేశారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో దాదాపు 40 వేల ఎకరాలు దేవాదాయ భూమి రికార్డులలో కనిపించడకుండా పోయాయని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఇవికాక.., దసపల్లా భూములు, కార్తీక వనం, బేపార్క్, ఎన్సీసి రామానాయుడు స్టూడియో వంటి భూములను లాకున్నారు. వీటి విలువ ప్రస్తుతం 70 వేల కోట్లు ఉంటుందని అయ్యన్న చెప్పుకొచ్చారు. న్యాయస్థానాలు, ఎన్జీటీని కాదని రుషికొండపై జగన్మోహన్ రెడ్డి కడుతున్న నిర్మాణాలను టిడిపి ప్రభుత్వం రాగానే.. స్వాధీనం చేసుకుని.. వీటిని ప్రజా అవసరాలకు వినియోగిస్తామని ఆయన వెల్లడించారు.
చక్కటి పాలన అందించి.., ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన ముఖ్యమంత్రే ఇటువంటి భూదందాలు, దారుణాలకు పాల్పడుతుంటే .. రాష్ట్రంలో అన్ని విధాలుగా రెచ్చిపోతున్న మాఫియా గురించి ప్రత్యేకించి చెప్పన్నక్కర్లేదు. నేర చరిత్ర ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తే.. దోచుకోవడం.. దాచుకోవడం.. పంచుకోవడం తప్ప.. ఏం ..? తెలుసని జగన్ ప్రభుత్వం ప్రజలు లెంపలేసుకుని దుమ్మెత్తి పోస్తున్నారు. తుర్లవాడ కొండను కాపాడునే హక్కు ప్రతి హిందూపై ఉంది. దాన్ని అన్యాయక్రాంతం కాకుండా హిందూ దార్మిక సంఘాలు, పీఠాధిపతులు, సామాజీకవేత్తలు, న్యాయవాదులు అడ్డుకోని జగన్ చేష్టాలను ఎండగట్టాలని సోషల్ మీడియా వినతులు వెల్లువెత్తుతున్నాయి.