చంద్రబాబు రాముడైతే తాను మూర్ఖుడినని.. తెలుగుదేశం కుటుంబ సభ్యులను వేధించి ఇబ్బంది పెడుతున్న అధికారులు, వైసీపీ నాయకులను వదిలి పెట్టనని హెచ్చరించారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. టిడిపి 40 వ ఆవిర్భావ సభలో ఆయన ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. అధికార మదంతో వైసీపీ చేస్తున్న ఆకృత్యాలను చూస్తూ ఊరుకునేది లేదని.. వారు అమెరికాలో దాక్కున్నా, ఐవరీ కోస్ట్ లో దాక్కున్నా ప్రతీ ఒక్కటీ గుర్తుపెట్టుకుని వెంటాడతానని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు వైసీపీ పెట్టుడు కేసులకు భయపడదన్న లోకేష్.. తనపై హత్యాయత్నం సహాయ 11 కేసులు పెట్టారని, అటువంటి తాటాకు చప్పుళ్లకు తాను భయపడబోనని అన్నారు. తన పోరాటాన్ని వైసీపీ ఎంత ప్రయత్నిస్తే తాను అంతకు రెట్టింపు పట్టుదలతో ముందుకు వెళతానని స్పష్టం చేశారు.పోరాటం చేసి కేసులు పెట్టించుకున్న కార్యకర్తలే నాకు ఆప్తులన్న లోకేష్.. ఒక కార్యకర్త జోలికి వస్తే మొత్తం గ్రామమే తరలివస్తుందని..అదే ఒక నాయకుడి జోలికి వస్తే మొత్తం రాష్ట్ర పార్టీ అంతా వస్తుందని భరోసా ఇచ్చారు. తనకంటే ఒక కేసు ఎక్కువ ఉన్న కార్యకర్తలకే రేపు తాను పలుకుతానన్న ఆయన, గతంలో కేసులు ఉంటే చంద్రబాబు ఏమైనా అంటారేమోనని భయపడేవారు.. కానీ ఇప్పుడు కాలం మారింది.. ముల్లును ముల్లుతోనే తీయాల్సిన రోజులు వచ్చాయని కార్యకర్తలు, నాయకులు దేనికీ వెనకాడవద్దని అన్నారు.
మహానాడు వేదికగా తెలుగు తమ్ముళ్లు ప్రతిన పూనాలి.
నందమూరి తారాకరామారావు గారి పుట్టిన రోజు సందర్బంగా ప్రతి ఏడాది మే 27-...