కల్తీ సారా మరణాలపై న్యాయ విచారణ కోరుతూ టిడిపి శాశన సభాపక్షం ఆందోళనకు దిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలోని ఫైర్ స్టేషన్ నుంచి అసెంబ్లీ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.జంగారెడ్డి గూడెం కల్తీసారా మరణాలన్నీ జగన్ హత్యలే అంటూ ప్లెకార్డులు ప్రదర్శించారు. మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్ ఈరోజు రాష్ట్రంలో మహిళల తాళిబొట్లు తెంచుతున్నాడాని విమర్శించారు. జె బ్రాండ్లతో అమాయక ప్రజల ప్రాణాలతో వైసీపీ ప్రభుత్వం ఆడుకుంటోందని.. నాసిరకం మద్యం, కల్తీ సారాలకు ప్రాణాలు బాలిగొంతున్న పాపం జగన్ రెడ్డిదే అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Must Read:-జగన్ పై ఐటిడిపి సెటైర్లు