టిడిపి సభ్యుల సస్పెన్షన్ అనైతికమన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు. స్పీకర్ కి 5 నుంచి 6 మీటర్ల దూరంలో ఉండీ నిరసన తెలిపితే అకారణంగా తమ సభ్యులను సస్పెండ్ చేశారని ఆయన తెలిపారు. అసెంబ్లీలో బుద్దీ జ్ఞానం లేని వారే ఎక్కువమంది ఉన్నారని విమర్శించిన ఆయన.. వైసీపీ సభ్యులు భజన చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు.కల్తీసారా మరణాలపై ఆధారాలను తాము సభలో బయటపెడుతుంటే సిఎం జగన్ ముఖం చాటేశారని ఆయన తెలిపారు. ప్రతిపక్షం మాట్లాడేందుకు ఒక్క నిమిషం కూడా ఇవ్వని సభ చారిత్రకెక్కిందని ఆయన ఎద్దేవా చేశారు. టిడిపి సభ్యులను సస్పెండ్ చేశాకే సభను నడిపించాలనే ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న ఆయన ఎంతమందిని సస్పెండ్ చేసినా తెలుగుదేశం చిట్టచివరి సభ్యుడు వరకూ కల్తీసారాపై పోరాడితీరుతామని స్పష్టం చేశారు.
Must Read:-జగన్ @1000 వైసీపీ వెయ్యి రోజుల పాలన