సమంత ఎక్కడుంటే ప్రీతమ్ జుకల్కర్ అక్కడుంటాడు. వీరిద్దరికీ బాగానే వర్కవుట్ అవుతోంది.. అది వర్కవుట్లు అవుతున్నాయి. ఆమె ఈ విషయంలో ఎంత ఎంకరేజ్ చేసినా అతను మాత్రం ఫెయిలవుతున్నాడు. వర్కవుట్ మీద ఎంత లవ్వు ఉన్నా కొవ్వు కరగాలంటే తప్పదు. ఆమె అతనికి ఛాలెంజ్ విసరడం.. అతను దాన్ని అందుకోలేకపోవడం తరచూ జరుగుతోంది. సమంతకు ఇప్పుడు సోలో బతుకే సో బెటర్ అనిపిస్తోంది. అందుకే స్నేహమేరా జీవితం అనుకుంటూ వారితో చెట్టపట్టాలేసుకు తిరుగుతోంది.
అలాంటి స్నేహితుల్లో శిల్పారెడ్డి, ప్రీతమ్ జుకల్కర్ లాంటి వారు ఉన్నారు. ఈ బృందంతో సమంత చేసే వీడియోలు నెట్టింటో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా జిమ్ సెషన్ వీడియోలకు భలే క్రేజ్ ఉంది. ఆఖరికి క్యారవ్యాన్ లోనూ ఈ బృందం హల్ చల్ చేస్తుంటుంది. ఈ మధ్య లెవల్ ఆఫ్ ఛాలెంజ్ అంటూ సమంత ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె కప్పగెంతులు వేసింది. కాళ్ల మీద ఎగురుకుంటూ వెళ్లాలట. ఇలా చేస్తే కొవ్వు కాస్తా కరిగిపోతుందని ఆమె అంటోంది. ఈ వింత ఛాలెంజ్ ను స్వీకరించిన ఆమె మిత్ర బృందం తమ వల్ల కాదంటూ చేతులెత్తేశారు.
ఈ ఏడాదిని ఇలా అద్భుతంగా ప్రారంభించమంటూ ఆమె యమస్పీడుగా ఎగురుకుంటూ వెళుతోంది. ఆమె విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించడం, చివరికి చతికిల పడటం జరుగుతోంది. మొదట ఆమె హెయిర్ స్టయిలిస్ట్ రోహిత్ భట్కర్ ట్రై చేసి ఫెయిలయ్యాడు. అలా మూడు నాలుగు సార్లు ప్రయత్నించాక విజయవంతమయ్యాడు. ఆ తర్వాత మేకప్ ఆర్టిస్ట్ అవ్ని రంభియా ప్రయత్నించాడు. చేయలేక ఆమె వెనక్కి పడిపోయారు. మన హీరో ప్రీతమ్ జుకల్కర్ వచ్చి ట్రై చేసినా అతని వల్ల కాలేదు. ఫ్యామిలీ ఉమెనా మజాకానా.. దటీజ్ సామ్.. మిగతా వారంతా ఢామ్.











