టాలీవుడ్ నిర్మాత పి.డి.వి ప్రసాద్ భార్య అంజు ప్రసాద్ (53) ఈ మధ్యాహ్నం గుండెపోటుతో మరణించారు. సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. వీరికి ఇద్దరు సంతానం.
ప్రసాద్ ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని నిర్మించే చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గానూ, సితారా ఎంటర్ టైన్ మెంట్ వారు నిర్మించే చిత్రాలకు సమర్పకుడిగానూ వ్యవహరిస్తుంటారు. అంజు ప్రసాద్ మృతికి టాలీవుడ్ సినీ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు.











