రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రాధేశ్యామ్’. ఈ సినిమా టీమ్ ఇటీవల ఇటలీ షెడ్యూల్ ముగించుకొని హైద్రాబాద్ లో ల్యాండ్ అయింది. ప్రభాస్, పూజా హెగ్డేలపై కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ ఇటలీలోనే జరిగింది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వింటేజ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ‘రాధేశ్యామ్’ తెరకెక్కుతోంది. కరోనా లాక్ డౌన్ కారణంగా.. ఇప్పటికే చాలా లేటైన ఈ సినిమా షూటింగ్ ను ఎట్టి పరిస్థితుల్లోనైనా కంప్లీట్ చేయాలనే పట్టుదలతో ఉన్నారు మేకర్స్.
తాజా సమాచారం ప్రకారం ‘రాధేశ్యామ్’ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారట. త్వరలో ప్రారంభం కానున్న ఆఖరి షెడ్యూల్ డిసెంబర్ నెలాఖరు వరకూ కంటిన్యూస్ గా జరుపుకోనుందట. దీంతో ‘రాధేశ్యామ్’ మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఆల్రెడీ సంక్రాంతి బరిలో ఉన్న మిగతా హీరోలకు రాధేశ్యామ్ గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని చెబుతున్నారు. ఇంతకు ముందు విడుదలైన రాధేశ్యామ్ మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ అభిమానుల్ని ఎంతగానో అకట్టుకున్నాయి. డార్లింగ్, మిస్టర్ పెర్ఫెక్ట్ తర్వాత ప్రభాస్ నటిస్తోన్న రొమాంటిక్ లవ్ స్టోరీ ఇదే కావడంతో.. ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ‘రాధేశ్యామ్’ వచ్చే సంక్రాంతికి మిగతా హీరోలకు ఏ రేంజ్ లో గట్టి పోటీనిస్తాడో చూడాలి.











