అమెరికాలో దాదాపు కొత్త ప్రభుత్వం ఏర్పడబోతున్న తరుణంలో మరో అద్భుతం చోటు చేసుకుంది. ఎన్నికల బరిలో నిలిచిన మొట్ట మొదటి స్వలింగ సంపర్కుడు నల్ల జాతియుడు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి రిచీ టోరెస్ విజయం సాధించాడు. ప్రస్తుతం ఇతను న్యూయార్క్ సిటీ కౌన్సిల్ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఆయన న్యూయార్క్ నుంచి పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. తన ప్రత్యర్థి అయిన రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ప్యాట్రిక్ డెలిసెస్ ఓడించాడు.
ఈ సందర్భంగా టోరెస్ మాట్లాడుతూ.. నేటి నుంచి కొత్త అధ్యయనం మొదలవబోతుందంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తను ఈ ఎన్నికల్లో విజయం సాధించడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు.
అయితే ఇదే ఎన్నికల్లో మరో స్వలింగ సంపర్కుడు, నల్ల జాతీయుడు కూడా బరిలో నిలిచారు. అయితే అతని ఫలితాలు ఇంకా వెలువడని కారణంగా అతని విజయం పై సందిగ్థత నెలకొంది. ఒక వేళ అతను కూడా ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే కనుక ఒకేసారి అమెరికా ప్రభుత్వంలో ఇద్దరు నల్లజాతీయులు..అది కూడా స్వలింగ సంపర్కులు ఉన్నట్లవుతుంది. నల్లజాతి స్వలింగ సంపర్కులకు ప్రభుత్వంలో చోటు లభించడం పై అమెరికా వ్యాప్తంగా హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి.