పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియా మూవీ సలార్. ఈ చిత్రానికి కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన శృతిహాసన్ నటిస్తోంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచి సలార్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎప్పుడెప్పుడు సలార్ వస్తుందా అని ప్రభాస్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కారణం ఏంటంటే.. అభిమానులు ప్రభాస్ ని ఎలా చూడాలనుకుంటున్నారో అలా సలార్ పక్కా మాస్ మసాలా స్టోరీతో ఉండబోతోంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతోందని గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ చిత్రాన్ని రెండు పార్టులుగా రిలీజ్ చేశారు. అలాగే ప్రభాస్ బాహుబలి చిత్రాన్ని రెండు పార్టులుగా రిలీజ్ చేశారు. సలార్ ను కూడా రెండు పార్టులుగా విడుదల చేయాలి అనుకుంటున్నారని సోషల్ మీడియాలో న్యూస్ హల్ చల్ చేస్తోంది. ఇటీవల శృతిహాసన్ పుట్టినరోజు సందర్భంగా బర్త్ డే విషెష్ తెలియచేస్తూ సలార్ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు కానీ.. ప్రచారంలో ఉన్న సలార్ రెండు పార్టులు గురించి స్పందంచలేదు.
దీంతో సలార్ రెండు పార్టులుగా రానున్నది అనేది నిజమే అని ప్రచారం మొదలైంది. తాజా వార్త ఏంటంటే.. ప్రభాస్ సన్నిహితులు సలార్ రెండు పార్టులుగా రాబోతుందనేది నిజమే అని కన్ ఫర్మ్ చేశారని వార్తలు వస్తున్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ రెండు పార్టులుగా చేస్తున్న సినిమా ఇది. ఇందులో ప్రభాస్ పవర్ ఫుల్ రోల్ కనిపించనున్నారని లుక్ ను బట్టి తెలుస్తోంది. ఇక సలార్ రెండు పార్టులు అంటే… అభిమానులకు పండగే.











