అక్కినేని ఫ్యామిలీ మ్యాన్ సమంత.. ఫ్యామిలీ లేని ఉమన్ గా మారబోతోందా? సినిమా వాళ్లను మొదట్నుంచీ గాసిప్స్ వెంటాడుతూనే ఉంటాయి. నిప్పులేకుండా పొగరాదంటారు.. ప్రస్తుతం పొగ మాత్రం వ్యాపించింది. నిప్పు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. విడాకులు అనే మాట సమంత విషయంలో మొదట్నుంచీ వినిపిస్తూనే ఉంది. దానికి ఆమె తనదైన శైలిలో స్పందిస్తూనే ఉంది. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఓసారి ఆమెకు ఇన్ స్టాలో నెటిజన్ నుంచి తమాషా ప్రశ్న ఎదురైంది.
‘చైతూకి విడాకులు ఇచ్చెయ్.. మనిద్దరం పెళ్లి చేసుకుందాం’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దానికి ఆమె స్పందిస్తూ ‘కష్టం.. చై (నాగ చైతన్య)ను అడుగు’ అంటూ బదులిచ్చింది. తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది. ఆమె సోషల్ మీడియాలో అక్కినేని అనే ఇంటి పేరును తొలగించడంతో చాలామంది అనుమానం పెనుభూతమైంది. ఆ మధ్య ఓ మీడియా ఇంటరాక్షన్ లో కూడా ఆమె దాటవేత సమాధానం ఇచ్చింది. ఇలాంటి వాటిపై సాధారణంగా తాను స్పందించనని సమాధానమిచ్చింది.
మరి ఇంటి పేరును వదిలేయడానికి గల కారణం ఏమిటో మాత్రం ఆమె వివరించలేదు. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ సమంతకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ప్రస్తుతం గుణశేఖర్ ‘శాకుంతలం’లో నటిస్తోంది. తమిళ చిత్రం ‘కథువాకుల రెండు కాదల్’ చిత్రాన్ని కూడా పూర్తిచేసింది. ఈ రెండు సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి. గొడవలు తన మనస్తత్వానికి నచ్చవని ఆమె అంటూ ఉంటుంది. ప్రస్తుతం ఆమె కొత్తగా అంగీకరించిన సినిమాలు ఏవీ లేవు. కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నట్టు మీడియాలో వార్తలొచ్చాయి. నాగచైతన్య నటించిన ‘లవ్ స్టోరీ’ విడుదలకు సిద్ధంగా ఉంది. హిందీలో ‘లాల్ సింగ్ చద్దా’లో నటిస్తున్నాడు.
తెలుగులో ‘బంగార్రాజు’ను తండ్రితో కలిసి చేస్తున్నాడు. అక్కినేని కుటుంబ హీరోలకు మొదటి పెళ్లి అచ్చిరావడం లేదేమో అని కూడా అనిపిస్తోంది. అక్కినేని నాగార్జున కూడా అమలను చేసుకున్నది రెండో పెళ్లి. నాగ్ మేనల్లుడు సుమంత్ పెళ్లి కూడా పెటాకులుగా మారింది. అఖిల్ కు అంతా ఓకే అనుకున్న తరుణంలో పెళ్లి ఆగిపోయి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ గా మారిపోయాడు. అక్కినేని నాగచైతన్య విషయంలో అలా జరగకూడదనే అభిమానులు కోరుకుంటున్నారు. ఇవన్నీ గాసిప్సేనని ఎవరో ఒకరు ప్రకటిస్తే ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పడిపోతుంది. అయినా ఈరోజుల్లో దీన్ని ఇంతలా బూతద్దంలో చూడటం కూడా అనవసరం.
Must Read ;- లవ్ స్టోరీ మళ్లీ వాయిదా.. న్యూ రిలీజ్ డేట్ ఇదేనా?











