Naga Chaitanya Love Story Movie :
యువ సమ్రాట్ నాగచైతన్య, ఫిదా బ్యూటీ సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం లవ్ స్టోరీ. ఈ చిత్రానికి సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. విభిన్న ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఈ సినిమా పై బారీ అంచనాలు ఉన్నాయి. ఎప్పుడో ఈ సినిమా రిలీజ్ కావాలి కానీ.. కరోనా కారణంగా ఆగింది. ఈ సినిమాలోని సారంగదరియా సాంగ్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ సాంగ్ ఈ సినిమా పై అంచనాలను రెట్టింపు చేసిందని చెప్పచ్చు. ఈ మూవీ వాయిదా పడడంతో ప్రముఖ ఓటీటీ సంస్థల నుంచి 10 భారీ ఆఫర్స్ వచ్చాయట.
ఈ విషయాన్ని స్వయంగా ఈ చిత్ర నిర్మాతే చెప్పారు. ఈ సినిమాను ప్రేక్షకులు థియేటర్లోనే చూడాలని.. అందుకే ఓటీటీ నుంచి భారీ ఆఫర్స్ అవి కూడా 10 భారీ ఆఫర్స్ వచ్చినా సినిమాను ఇవ్వలేదన్నారు. ప్రేక్షకులు థియేటర్స్ లోనే తమ చిత్రం చూడాలన్నది తమ కోరిక అని అన్నారు. అయితే.. ఈ చిత్రం న్యూ రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. ఆగష్టులో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి నటిస్తున్న మరో చిత్రం ఇది.
అయితే… తాజా సమాచారం ప్రకారం ఆగష్టు 6న ఈ చిత్రాన్నివిడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయనున్నారు. మరి.. మజిలీ, వెంకీమామ చిత్రాలతో వరుసగా సక్సస్ సాధించిన నాగచైతన్య లవ్ స్టోరీ సినిమాతో హ్యాట్రిక్ సాధిస్తాడని ఆశిద్దాం.
Must Read ;- నేనిష్టపడే దర్శకుడు శేఖర్ కమ్ముల: హీరో ధనుష్











