అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ఏజెంట్. దీనికి స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ నెల రెండో వారంలో కృష్ణపట్నం పోర్ట్ దగ్గర షూటింగ్ స్టార్ట్ చేయనున్నారని తెలిసింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే.. పుష్ష సినిమాలో ప్రధాన ప్రతినాయకుడిగా మలయాళ నటుడు ఫాజల్ ని ఎంచుకున్న సంగతి తెలిసిందే.
ఈ ఫాజిల్ నే ఏజెంట్ మూవీలో విలన్ గా నటింపచేసేందుకు సంప్రదించినట్టు సమాచారం. ఇందులో మలయాళ సీనియర్ హీరో మమ్ముట్టి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. మమ్ముట్టి ఏజెంట్ మూవీలో నటిస్తున్నారని తెలియగానే తనే విలన్ అనుకున్నారు. అయితే.. ఇందులో మమ్ముట్టిది పాజిటీవ్ పాత్ర. ఇంకా చెప్పాలంటే.. అఖిల్ కి గురువు లాంటి పాత్ర అని సమాచారం. విలన్ కోసం ఫాజిల్ వైపు చూపు మరలింది. ఇప్పటికీ మమ్ముట్టి ఉన్నాడు కాబట్టి, ఈ చిత్రానికి మలయాళంలో మంచి మార్కెట్ ఏర్పుడుతుంది. ఫాజిల్ ని కూడా తీసుకుంటే… మలయాళ ప్రేక్షకుల్ని మరింతగా ఆకట్టుకోవడం ఖాయం అని చెప్పచ్చు.
ఈ సినిమాకి కూడా ఫాజిల్ భారీ పారితోషికాన్నే డిమాండ్ చేస్తున్నాడని సమాచారం. ప్రస్తుతానికి చర్చలు సాగుతున్నాయి. ఈ సినిమాని అనిల్ సుంకర, సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తుండడం విశేషం. ఈ సినిమా పై అక్కినేని అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. మరి.. ఆ నమ్మకాన్ని సురేందర్ రెడ్డి నిజం చేసి అఖిల్ కి బ్లాక్ బస్టర్ సక్సస్ అందిస్తాడని ఆశిద్దాం.
Must Read ;- అఖిల్ ఏజెంట్ లో మమ్ముట్టి పాత్ర ఇదే











