అక్కినేని నాగచైతన్య – ఫిదా బ్యూటీ సాయిపల్లవి జంటగా నటించిన తాజా చిత్రం లవ్ స్టోరీ. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ.. కరోనా కారణంగా వాయిదా పడుతూనే ఉంది. కరోనా ఫస్ట్ వేవ్ వలన ఒకసారి రిలీజ్ వాయిదా పడింది. ఆతర్వాత సెకండ్ వేవ్ వలన మరోసారి వాయిదా పడింది. రీసెంట్ గా సెప్టెంబర్ 10న రిలీజ్ అని ప్రకటించారు. ఇప్పుడు మరోసారి వాయిదా పడిందని సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల రేట్ల వ్యవహారంలో నెలకొన్న సందిగ్ధత కూడా లవ్ స్టోరి వాయిదాకు ఓ కారణమని తెలిసింది.
ఏపీలో టిక్కెట్ల రేట్ల విషయమై ఏపీ సీఎం జగన్ తో సినీ పెద్దలు భేటీ కానున్నారు. ఆతర్వాత ఏపీలో టిక్కెట్ల విషయమై ఓ క్లారిటీ వస్తుంది. అందుచేత పూర్తిగా పరిస్థితులు చక్కబడ్డాకే లవ్ స్టోరీ మూవీని రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే.. తాజా సమాచారం ప్రకారం.. లవ్ స్టోరీ మూవీని సెప్టెంబర్ 30న కానీ.. అక్టోబర్ 1న కానీ రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. మేకర్స్ ఈ రెండు డేట్ లను పరిశీలిస్తున్నారని.. త్వరలోనే క్లారిటీ రానుందని టాక్ వినిపిస్తోంది. అంతా కన్ పర్మ్ అయిన తర్వాత లవ్ స్టోరీ న్యూ రిలీజ్ డేట్ ను అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారు.
ఇదే కనుక జరిగితే.. అక్కినేని బ్రదర్స్ నాగచైతన్య, అఖిల్.. ఇద్దరూ వారం రోజుల గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు రావడం జరుగుతుంది. ఇలా జరిగితే అక్కినేని అభిమానులకు పండగే.
Must Read ;- సమంత, చైతూల మధ్య మనస్పర్ధలా?











