కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి.. టాలీవుడ్ లోనూ మంచి ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. తమిళ్, తెలుగులో ఒకేసారి విడుదల వుతుంటాయి అతడి సినిమాలు. రీసెంట్ గా సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా ఓటీటీలో బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.
సామాన్యుడికి సైతం విమాన ప్రయాణం చేసే అవకాశం రావాలని తపించి.. ఎన్నో కష్టాలు అనుభవించి.. దాన్ని నెరవేర్చే ఉదాత్తమైన పాత్రలో సూర్య జీవించిన సంగతి తెలిసిందే. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా ఆ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఇక సూర్య తదుపరి చిత్రం కథ కూడా ప్రజా సమస్యమీద పోరాడడమే. ఈ సినిమాలో అతడు పవర్ ఫుల్ లాయర్ గా నటిస్తున్నాడు.
ప్రముఖ దర్శకుడు టీ.జే.జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో సూర్య లాయర్ గా నటిస్తున్నాడు. నల్లకోటు లో రివీలైన సూర్య.. దేని గురించో పోరాడుతోన్న ఆన్ లైన్ ఫోటోస్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ గా మాస్ లాయర్ గా అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సూర్య కూడా అదే బాటలో నడుస్తుండడం విశేషంగా మారింది. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ సినిమా సూర్యకి ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.