కరోనా వైరస్ విరుచుకుపడుతున్న నేపథ్యంలో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతిఒక్కరూ మాస్కలు వాడుతున్నారు. మాస్కుల వాడకం బాగా పెరగడంతో మార్కెట్లోకి రకరకాల మాస్కులు అందుబాటులోకి వస్తున్నాయి. ఎన్95 మాస్కులు.. క్లాత్ మాస్కులు.. వన్ టైం యూజ్ మాస్కులు.. ఇలా ఎన్నో ఉన్నాయి. అయితే త్వరలోనే మన ముందుకు స్మార్ట్ మాస్క్ రాబోతోంది. దీని ప్రత్యేకత ఏంటంటే.. గాలిని పసిగడుతుంది. అంతేకాదు.. వైరస్ ను మన దారిదాపుల్లోకి కూడా రానివ్వదట. ఎంతసేపు మాస్క్ పెట్టుకుంటున్నాం.. ఎంత గాలిని పీల్చుకుంటున్నాం.. క్వాలిటీ గాలిని పీల్చుకుంటున్నామా లేదా.. అలాంటి విషయాలు ఈజీగా మనకు తెలియజేస్తుంది. గాలిని ఫిల్టర్ చేయడం దీని ప్రత్యేతక. ఇదోక ఎలక్ట్రానిక్ మాస్క్. ఇది యాప్ తో అనుసంధానమై పనిచేస్తుంది. ఎయిర్ పాప్ అనే కంపెనీ స్మార్ట్ మాస్క్ ను తయారుచేసే పనిలో ఉందంట. త్వరలో ఇది మనముందుకు రానుందట.
Must Read ;- ఉతకని మాస్కులతోనూ ముప్పే : బ్లాక్ ఫంగస్ వచ్చే ప్రమాదం!











