నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య మందుపై పరిశోధన పురోగతి గురించి ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆరా తీశారు.ఈ ఉదయం కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి కిరణ్ రిజిజుకు ఆయన ఫోన్ చేయగా పరిశోధన పురోగతి గురించి ఉపరాష్ట్రపతికి మంత్రి వివరించినట్లు తెలుస్తోంది.అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశం కాబట్టి,ఎటువంటి వివాదాలకు తావు లేకుండా అన్ని కోణాల్లో పరిశోధన చేయవలసి ఉంటుందని,దీంతో సమయం పడుతోందని మంత్రి తెలిపినట్లు సమాచారం.ఏ విషయంలోనూ రాజీ పడకుండా,వీలైనంత త్వరగా పరిశోధన పూర్తి చేస్తామని ఉపరాష్ట్రపతికి కేంద్ర మంత్రి వివరించినట్లు తెలుస్తోంది.
ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ ప్రొ.బలరాం భార్గవ్‌తోనూ ఈ మందుపై ఉపరాష్ట్రపతి ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది.ఈ మందు ఆయుష్ విభాగ పరిధిలోనిది గనుక,ఇప్పటికే ఆయుష్ పరిశోధన కొనసాగుతున్ననేపథ్యంలో మళ్లీ అదనంగా ఐసీఎంఆర్ విచారణ అవసరం లేదని ఆయన ఉపరాష్ట్రపతికి తెలిపినట్లు సమాచారం.
Must Read ;- ఆనందయ్య మందుపై వైసీపీ దందా.. వంట వాళ్లతో పెద్ద ఎత్తున తయారీ











